Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం బర్ఫీ తయారీ విధానం.....

వాల్‌నట్స్‌లో బాదం ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పప్పులో విటమిన్స్, ప్రోటీన్స్, మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి సంబంధిత వ్యాధులకు చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా బాదం చాలా ఇష్టంగా ఉంట

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (13:20 IST)
వాల్‌నట్స్‌లో బాదం ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పప్పులో విటమిన్స్, ప్రోటీన్స్, మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి సంబంధిత వ్యాధులకు చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా బాదం చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి బాదం పప్పుతో బర్ఫీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు: 
బాదంపప్పు - 1 కప్పు
చక్కెర - 1/4 కప్పు 
నెయ్యి - 1/4 కప్పు  
పాలు - 1/4 కప్పు 
పిస్తా - గార్నిష్‌కి సరిపడా
 
తయారీ విధానం: 
ముందుగా బాదంపప్పులను కొద్దిసేపు వేడినీళ్ళలో నానబెట్టిన తరువాత వాటి పొట్టును తీసివేయాలి. ఆ బాదం పప్పులను పాలతో కలిపి మెత్తగా గ్రైండ్‌ చెయ్యాలి. ఒక పాన్‌ తీసుకొని పంచదార, కొద్దిగా నీరు పోసి తీగ పాకం పట్టాలి.  గ్రైండ్‌ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్‌ను పాకంలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అది దగ్గరకి వస్తుండగా కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలుపుకోవాలి.

ఈలోగా ఒక స్టీల్‌ ప్లేట్‌‌ను తీసుకుని దానికి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా ఉడికి విడివిడిలాడుతుండగా దింపేయాలి. వెంటనే ప్లేట్‌ మీద కొద్దిగా మందంగా ఈ మిశ్రమాన్ని వేయాలి. అది గట్టిపడుతుండగా మీకు కావలసిన షేప్‌లో దానిని కట్‌ చేయాలి. చివరగా బాదం, పిస్తా పలుకులతో గార్నిష్‌ చేయాలి. అంతే బాదం బర్ఫీ రెడీ.  

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments