గసగసాలు వాటితో కలిపి బాగా పొడి చేసి తింటే...?
గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు తలా 100 గ్రాములు తీసుకుని పౌడర్‌లా తయారుచేసుకోవాలి. ఈ పౌడర్‌ను ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. గసగసాలు, సగ్గుబియ్యం, బార్లీ మూడింటిని పదేసి గ్రాములు
గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు తలా 100 గ్రాములు తీసుకుని పౌడర్‌లా తయారుచేసుకోవాలి. ఈ పౌడర్‌ను ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. గసగసాలు, సగ్గుబియ్యం, బార్లీ మూడింటిని పదేసి గ్రాములు తీసుకుని బియ్యంతో చేర్చి జావలా తీసుకుంటే నడుము నొప్పి తగ్గిపోతుంది. కొత్తిమీరతో పాటు 20 గ్రాముల గసగసాలు చేర్చే రుబ్బుకని పేస్టులా తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చును.
గసగసాలు, మిరియాలు, బాదం, కలకండను సమపాళ్లలో తీసుకుని పొడి చేసుకుని అందులో పాలు, తేనె, నెయ్యితో కలిపి మిశ్రమంలా చేసుకుని ప్రతి రోజూ అరస్పూన్ రాత్రి పాలలో చేర్చుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. గసగసాలను దానిమ్మరసంలో నానబెట్టి రుబ్బుకుని త్రాగితే నిద్రలేమిని దూరం చేస్తుంది.
నోటిపూతను దూరం చేసుకోవాలంటే అరకప్పు టెంకాయ తురుములో అరస్పూన్ గసగసాలను చేర్చి రుబ్బుకుని పచ్చడిలా తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. గసగసాలను కొబ్బరి పాలలో నానబెట్టి తీసుకుంటే నోటిపూతను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.