జుట్టు ఊడిపోతుందా... ఈ చిట్కాలు పాటిస్తే....
జుట్టు పెరడానికి ఒక కప్పు పొన్నగంటి కూర అందులో గోరింటాకు పొడి, మెంతిపొడి, అరకప్పు పెరుగు, స్పూన్ నిమ్మరసం, నీళ్లు పోసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తరువాత త
Publish Date: Mon, 18 Jun 2018 (14:07 IST)
Updated Date: Tue, 19 Jun 2018 (09:37 IST)
జుట్టు పెరడానికి ఒక కప్పు పొన్నగంటి కూర అందులో గోరింటాకు పొడి, మెంతిపొడి, అరకప్పు పెరుగు, స్పూన్ నిమ్మరసం, నీళ్లు పోసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే రోజుకో ఆకుకూర తీసుకోవాలి.
అవి శరీరాన్నే కాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా కొద్దిగా మజ్జిగలో చింత చిగురు, కప్పు గోరింటాకు పొడి, అరకప్పు శనగపిండి వేసి కలుపుకోవాలి. తలకు బాగా నూనెను రాసుకున్న తరువాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.
ఇలా చేయడం వలన జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. గోరింటాకు పొడిలో రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి, కప్పు పెరుగు వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తరువాత స్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.