Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి పిండివంటలు... ఔరౌర గారెలల్ల.. అయ్యారే బూరెలిల్ల

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (12:20 IST)
భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో మరింత ప్రస్ఫుటంగా కనిపించేది పండుగల వేళలోనే. విభిన్న రాష్ట్రాల్లో పండుగలు చేసే తీరు విభిన్నంగా ఉండొచ్చు లేదంటే భిన్నమైన పేర్లూ ఉండొచ్చు కానీ ఆ పండుగల వెనుక దాగిన పరమార్ధం మాత్రం ఒకటే. దీనికి అత్యుత్తమ ఉదాహరణ సంక్రాంతి.

 
భారతీయ పల్లె వైభవానికి ప్రతీక ఈ పండుగ. మాఘీ లేదా లోహ్రీ అని ఉత్తర భారతదేశంలో దీనిని వేడుక చేసుకుంటే, మాఘ్‌ బిహు అని ఈశాన్య రాష్ట్రాలలో, ఉత్తరాయణ్‌ అని పశ్చిమ భారతదేశంలో, తమిళనాడు వాళ్లు పొంగల్‌ అని మహారాష్ట్ర, గుజరాత్‌లలో మకర్‌ సంక్రాంతి అని, తెలుగు వాళ్లు సంక్రాంతి అని అంటుంటారు. పంటలు బాగా పండాలని కోరుకుంటూనే ప్రకృతికి ధన్యవాదములు తెలుపుతూ చేసుకునే రైతుల పండుగ సంక్రాంతి. 

 
తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిన తరువాత సంక్రాంతి పండుగ చేసుకునే తీరులో మార్పులు వచ్చాయి కానీ సంప్రదాయ వంటకాల పరంగా మాత్రం మార్పేమీ లేదు.  పిండివంటలు, ఇప్పటికీ ప్రతి తెలుగింట పండుగ రోజు నోరూరిస్తుంటాయి. భోగి పండుగగు వారం రోజుల ముందు నుంచే ఇంటిలో ప్రారంభమయ్యే హడావుడి ముక్కనుమ వెళ్లిన మూడు రోజుల వరకూ కనిపిస్తుంది. 

 
కొత్త ధాన్యం ఇళ్లకు చేరటంతో అరిసెలు, పూత రేకులు లాంటి వెరైటీలతో పాటు పులగం, పరమాన్నం, చక్కెర పొంగళి, పాయసం.. ఇలా ఎన్నో వంటకాల విందు అలరిస్తుంటుంది. సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి ఇంటిలోనూ కనిపించే అరిసెలు, కజ్జికాయలు, మురుకులు(జంతికలు), బూందీ లడ్డు వంటి వాటి తయారీలో కలిసి ఉండటమనే పరమార్ధమూ దాగి ఉంది. ఎందుకంటే అరిసెలు లాంటి పిండివంటలు చేయడం ఒక్కరివల్ల అయ్యేది కాదు కదా!

 
సంక్రాంతి వేళ తప్పనిసరిగా దర్శనమిచ్చే పిండివంటకాలలో అరిసెలు అత్యంత ప్రధానమైనవి. తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ.. మూడు ప్రాంతాల్లోనూ అరిసెలు తప్పనిసరిగా సంక్రాంతి వేళ కనిపిస్తాయి. అరిసెల తయారీలో బియ్యం పిండి, బెల్లం అతి ప్రధానమైనవి. నూనె లేదంటే నెయ్యితో వీటిని తయారుచేస్తారు. అరిసెలకు రుచి, తమకు ఆరోగ్యం కావాలనుకునే వారు మాత్రం వీటిలో నువ్వులు కూడా వేస్తుంటారు.

ఎలాంటి అరిసె అయినా బెల్లం పాకం పట్టడంలోనే దాని రుచి నిర్ధారించబడి ఉంటుంది. ఈ పాకం పట్టడంలోనే మహిళల నైపుణ్యతా తెలుస్తుంది. కరకరలాడటం లేదంటే సాగటం ఈ పాకం, దానిలో కలిపే పిండి పరిమాణాలతో పాటుగా వాడే నూనె కూడా అరిసెకు రుచి అందిస్తుంది. స్వచ్ఛత, రుచి కలిగిన గోల్డ్‌డ్రాప్‌ ఈ వంటలకు వినూత్న రుచులను అందిస్తుంది. అలాగే సకినాలు, జంతికలు... ఏవైనా సరే గోల్డ్‌డ్రాప్‌ లాంటి నూనెతో పాటుగా కలిపే తీరు కూడా రుచిలో వైవిధ్యత అందిస్తాయి. 

 
అయితే ఇవేవీ ఒంటరిగా చేసుకునే స్వీట్లైతే కావు. కలిసికట్టుగా ఉండాలనే సత్యాన్ని అత్యంత అందంగా ఇవి వెల్లడిస్తాయి. పులిహోరలో పసుపు, పులుపు, తాలింపు సమపాళ్లలో ఉంటేనే రుచిగా ఉంటుంది. అలాగే  అరిసెలలో పాకం, పిండి, చక్కదనంతో కూడిన నూనె ఉంటేనే రుచిగా ఉంటుంది. పాయసమైనా, కేసరి అయినా అంతే! ఆరోగ్యవంతమైన పదార్థాల ఆహ్లాదకరమైన సమ్మేళనమే తియ్యందనాలను అందిస్తాయి. అదే రీతిలో అందరితోనూ కలిసిమెలిసి ఉంటేనే జీవితం సాఫీగానూ సాగిపోతుందనే సందేశాన్నీ ఇవి అందిస్తాయి.

 
‘‘సంక్రాంతి పండుగ కాలంలో ప్రతి ఒక్కరూ విభిన్న రకాల స్వీట్లు, రుచులు ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారు. పండుగ పూర్తయిన తరువాత కూడా ఇది కొనసాగుతుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్ధాలతో పాటుగా వాటి తయారీలో వినియోగించే నూనె కూడా అంతే నాణ్యతతో కూడి ఉండాల్సిన ఆవశ్యకతను ఇది వెల్లడిస్తుంది. ప్రపంచ శ్రేణి నాణ్యత తయారీ ప్రమాణాలను అనుసరించే గోల్డ్‌ డ్రాప్‌ నూనెలో వండే పిండివంటలు, విభిన్న రకాల ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మా వరకూ ఇది ‘సంక్రాంతి కా స్వాద్‌’’ అని మితేష్‌ లోహియా, డైరెక్టర్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, గోల్డ్‌ డ్రాప్‌ అన్నారు.

 
‘ఔరౌర గారెలల్ల.. అయ్యారే బూరెలిల్ల.. ఓహో హోరే అరిసెలెల్ల.. ఈయెల్ల నాకే చెల్ల..’అని మాయాబజార్‌ సినిమాలో ఘటోత్కచుడు లొట్టలేసుకుని తిని ఉండొచ్చు కానీ మనం మాత్రం అలా లొట్టలేయకపోయినా సంప్రదాయ రుచుల ఆస్వాదన చేస్తూనే పిండివంటల వెనుక దాగిన స్ఫూర్తిని గ్రహిస్తే, జీవితమంతా సంతోషమేగా!

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments