Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెప్పిన సిద్ధార్థ్: నెటిజన్ల హర్షం

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (11:18 IST)
భారత స్టార్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు హీరో సిద్ధార్థ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. సైనాపై సెటైరికల్‌గా చేసిన ట్వీట్ విమర్శలకు దారితీసింది. ఇంకా మహిళా సంఘాలు కూడా సీరియస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సిద్దార్థ్ ట్విట్టర్ ద్వారా సైనాకు క్షమాపణలు చెప్పడంతో పాటు వివరణ ఇచ్చుకున్నాడు.
 
'కొద్దిరోజుల క్రితం మీ ట్వీట్‌పై స్పందిస్తూ నేను వేసిన రూడ్ జోక్‌కి క్షమాణలు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా విషయాల్లో మీతో ఏకీభవించకపోవచ్చు. ఒక జోక్‌కి మనం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అది మంచి జోక్ కాదనే అర్థం. అలాంటి జోక్‌ను వాడినందుకు క్షమాపణలు.' అని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. 
 
తాను కూడా స్త్రీ పక్షపాతినే అని.. తన ట్వీట్‌లో లింగపరమైన విషయమేమీ లేదని... మీరొక మహిళ కాబట్టి మీపై దాడి చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని అన్నారు. సిద్దార్థ్ క్షమాపణల ట్వీట్‌పై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. సిద్దార్థ్ పరిణతితో వ్యవహరించారని... సైనాకు క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషమని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments