Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా జీవితం టీజర్ రూపంలో.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:29 IST)
భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తల్లైంది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనాపాలనా చూస్తోన్న సానియా మరోవైపు తన టెన్నిస్ అకాడమీని కూడా పర్యవేక్షిస్తోంది. ఇటీవలే కరోనా బారిన పడిన సానియా.. ఆ వైరస్‌ను జయించింది. కరోనా ఎఫెక్ట్ తర్వాత తిరిగి టెన్నిస్ లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది సానియా మీర్జా.
 
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ సానియా సొంతం. సానియా.. తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది.
 
సానియా కెరీర్‌లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలను, తనకు సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సానియా. లేటెస్ట్‌గా సానియా మీర్జా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
 
సానియా మీర్జా తన జీవితంలో ఒక రోజును టీజర్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. "నా జీవితంలో ఒక రోజు అంటూ" ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ వీడియోలో సానియా రోజు వారి దినచర్యను మనం గమనించవచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

తర్వాతి కథనం
Show comments