Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్చ్... వినేశ్ ఫొగాట్ శరీరం నుంచి రక్తం తీసినా.. వెంట్రుకలు కత్తిరించారు.. అయినా నిరాశే...

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (15:38 IST)
ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా బుధవారం రాత్రి జరగాల్సిన 50 కేజీల మహిళ రెజ్లింగ్ ఫైనల్ పోటీలో తలపడాల్సిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఆమె నిర్ణీత 50 కేజీల బరువు కంటే అదనంగా 100 గ్రాముల బరువు పెరిగారు. బుధారం రాత్రి జరగాల్సిన మ్యాచ్ కోసం బుధవారం ఉదయం ఆమె బరువును ఒలింపిక్స్ నిర్వాహుకులు పరిశీలించారు. ఆ సమయమంలో ఆమె 100 గ్రాముల అదనపు బరువు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమెపై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేసింది.
 
అయితే, మంగళవారం రాత్రి నాటికి వినేశ్ ఫొగాట్ నిర్ణీత 50 కిలోల కంటే రెండు కేజీల అదనపు బరువు ఉన్నారు. దాంతో బరువు తగ్గించేందుకు ఆమె జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ చేశారు. ఇక కోచ్, సహాయక సిబ్బంది అయితే ఆమెతో పాటు రాత్రంతా నిద్రహారాలు మానేసి వినేశ్ అదనపు బరువు తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఆమె శరీరం నుంచి కొంత మేరకు రక్తాన్ని కూడా తీశారు. జట్టును కూడా కత్తించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వస్తున్నాయి. ఈవెంట్‌కు ముందు 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడింది దీంతో మహిళపై ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌ నుంచి నిష్క్రమించాల్సివచ్చింది. 
 
అసలేం జరిగింది? పీటీ ఉషకు ప్రధాని మోడీ ఫోన్... వినేశ్‌‍కు ధైర్యవచనాలతో ట్వీట్! 
 
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల రెజ్లింగ్ పోటీల్లో భాగంగా 50 కేజీల కేటగిరీలో భారత్‌కు స్వర్ణం లేదా కాంస్యం పతకాల్లో ఏదో ఒకటి వస్తుందని ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాముల బరువు అధికంగా ఉన్నారని పేర్కొంటూ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో వినేశ్‌పై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరంద్ర మోడీ సహా అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వినేశ్ అనర్హతపై ప్రధాని మోడీ భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉషకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌‍లో అసలేం జరిగిందంటూ ఆయన వివరాలు సేకరించారు. వినేశ్ ఫొగాట్ అనర్హతకు దారితీసిన అంశాలను ప్రధానికి పీటీ ఉష వివరించారు. 
 
అంతేకాకుండా వినేశ్‌కు మనం ఏమైనా సాయపడగలమా? ఏమైనా మార్గాలు ఉన్నాయా? అని ప్రధాని అడిగారు. ఒకవేళ వినేశ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటే ఒలింపిక్స్‌లో గట్టిగా నిరసన తెలపండి అంటూ పీటీ ఉషకు ప్రధాని మోడీ సూచించారు. అదేసమయంలో వినీశ్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదిలావుంటే, వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై భారత్ ప్రొటోకాల్ ప్రకారం అప్పీల్ చేసినట్టుగా తెలుస్తుంది. 50 కిలోల విభాగంలో బుధవారం రాత్రి అమె ఫైనల్ పోటీలో తలపడాల్సివుంది. కానీ, ఉదయం ఆమెకు 50 కేజీల బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉన్నారు. దీంతో ఒలింపిక్స్ అసోసియేషన్ అనర్హత వేటు వేసింది. ఈ పరిణామంతో యావత్ భారత్ షాక్‌కు గురైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments