ఫెడెక్స్‌పై నీళ్లు చల్లిన అర్జెంటీనా స్టార్ అటగాడు...

అర్జెంటీనా స్టార్ టెన్నిస్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పోట్రో సంచలనం సృష్టించాడు. ఏకంగా అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన స్విస్ మాస్ట‌ర్‌ రోజర్ ఫెదరర్‌ను చిత్తు చేశాడు. న్యూయార్క్‌లోని ఆర్థ‌ర్ ఆషె స్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (11:23 IST)
అర్జెంటీనా స్టార్ టెన్నిస్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పోట్రో సంచలనం సృష్టించాడు. ఏకంగా అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన స్విస్ మాస్ట‌ర్‌ రోజర్ ఫెదరర్‌ను చిత్తు చేశాడు. న్యూయార్క్‌లోని ఆర్థ‌ర్ ఆషె స్టేడియంలో జ‌రిగిన ఈ క్వార్ట‌ర్స్ ఫైట్‌లో 7-5, 3-6, 7-6, 6-4తో ఫెద‌ర‌ర్‌పై డెల్ పోట్రో విజయబావుటా ఎగురవేశాడు. 
 
సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం ఇక్క‌డే స్విస్ మాస్ట‌ర్‌పై గెలిచి కెరీర్‌లో ఏకైక గ్రాండ్‌స్లామ్ గెలిచిన డెల్ పోట్రో.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఫెద‌ర‌ర్‌కు షాకిచ్చాడు. దీంతో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఫెద‌ర‌ర్‌, నాదల్ ఫైట్ చూడాల‌నుకున్న అభిమానుల ఆశ‌లు తీర‌లేదు. ఒక‌వేళ ఫెద‌ర‌ర్ ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే సెమీస్‌లో నాదల్‌తో పోటీ ప‌డేవాడు. 
 
ఇప్పుడు శుక్ర‌వారం జ‌ర‌గ‌బోయే సెమీస్‌లో డెల్‌పోట్రో, నాదల్ ఫైన‌ల్ బెర్త్ కోసం పోటీ ప‌డ‌నున్నారు. ఈ ఏడాది వింబుల్డ‌న్ గెలిచి మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన ఫెడెక్స్.. యూఎస్ ఓపెన్‌లో మాత్రం అంత సులువుగా క్వార్ట‌ర్స్ చేర‌లేక‌పోయాడు. తొలి రెండు రౌండ్ల‌లోనూ ఐదు సెట్ల పాటు పోరాడాల్సి వ‌చ్చింది. చివ‌రికి కాస్త గ‌ట్టి ప్ర‌త్య‌ర్థి క్వార్ట‌ర్స్‌లో ఎదుర‌వ‌డంతో ఫెడెక్స్ సెమీస్ కూడా చేర‌లేక‌పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments