ఇండియన్ వెల్స్ మ్యాచ్.. 36వసారి పోటీపడిన ఫెదరర్-నాదల్.. స్విజ్ మాస్టర్‌దే గెలుపు
ఇండియన్ వెల్స్ మాస్టర్స్‌లో స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ విజేతగా నిలిచాడు. టెన్నిస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ జయకేతనం
ఇండియన్ వెల్స్ మాస్టర్స్‌లో స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ విజేతగా నిలిచాడు. టెన్నిస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ జయకేతనం ఎగురవేశాడు. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో రోజర్ ఫెదరర్‌ను విజయం వరించింది. 68 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రోజర్ ఫెదరర్ ధీటుగా రాణించాడు. ఫలితంగా వరుస సెట్లలో 6-2, 6-3తో నాదల్‌పై ఫెదరర్ అలవోక విజయాన్ని సాధించాడు.
కాగా ఫెదరర్, నాదల్‌ల మధ్య పోరు ఇది 36వ సారి కావడం గమనార్హం. ఇండియన్ వెల్స్ క్వార్టర్ విజయానంతరం ఫెదరర్ హర్షం వ్యక్తం చేశాడు. నాదల్ మాట్లాడుతూ.. క్వార్టర్స్ మ్యాచ్‌లో ఫెదరర్ తన కంటే చాలా బాగా ఆడాడని నాదల్ పేర్కొన్నాడు. ఇకపోతే.. సెమీఫైనల్లో కిర్గియోస్‌తో ఫెదరర్ పోరు జరుగనుంది.