Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : ప్రారంభ మ్యాచ్‌లో పీవీ సింధు గెలుపు

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (08:37 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో ఇప్పటివరకు భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మూడో రోజైన ఆదివారం స్టార్‌ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో ఇజ్రాయిల్‌ షట్లర్‌ సెనియా పొలికర్‌పోను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ షెట్లర్‌కు పొలికర్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. దీంతో సింధు 21-7, 21-10తో విజయం సాధించింది. 
 
ఇక ఒలింపిక్స్‌ మూడో రోజు షూటర్లు నిరాశ పరిచినప్పట్టికీ రోయింగ్, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మంచి ఫలితాలు ఎదురయ్యాయి. రోయింగ్‌లో భారత రోయర్లు అరుణ్ లాల్​, అర్వింద్ సింగ్ అదరగొట్టారు. పురుషుల లైట్​వెయిట్ డబుల్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్‌లో టాప్​-3లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ పోటీలు జూలై 27న జరగనున్నాయి. 
 
మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు చుక్కెదురయింది. స్టార్‌ షూటర్లు మను బాకర్, యశస్విని దేస్వాల్ టాప్-8కు అర్హత సాధించలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఇద్దరు నిష్క్రమించారు. మను బాకర్‌ 12వ స్థానంలో, యశస్విని 13 స్థానంలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments