Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : పీవీ సింధు ఖాతాలో రెండో విజయం

Webdunia
బుధవారం, 28 జులై 2021 (10:10 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్-జెలో హాంకాంగ్ క్రీడాకారిణి చెయుంగ్ ఎన్‌గాన్ యితో జరిగిన పోరులో రియో రజతపతక విజేత సింధు 2-0తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వార్టర్స్‌కు అర్హత సాధించి పతకంపై ఆశలు రేపింది. 
 
ఇదిలావుంటే, మహిళల హాకీలో భారత జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. పూల్-ఎలో భాగంగా గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో 1-4 తేడాతో పరాజయం పాలైంది. ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 
 
ఎలిమినేషన్స్ రౌండ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన షానీ చేతిలో 6-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్‌లో రోయింగ్ జంట అర్జున్‌లాల్ జాట్-అర్వింద్ సింగ్ జోడీ 6: 24.41 రేసును పూర్తిచేసి ఫైనల్ బికి చేరుకుంది.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments