Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : పతకానికి మరింత చేరువకు చేరిన సింధు

Webdunia
గురువారం, 29 జులై 2021 (08:05 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్)లో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది. 
 
ఈ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ బ్లింక్‌ ఫెల్ట్‌‌పై 21-15, 21-13 తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. దీంతో ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. 
 
తొలి సెట్‌ను 21-15 తేడాతో సులువుగా గెలుచుకున్న సింధు, రెండో సెట్‌ను 21-13 తేడాతో మరింత సునాయాసంగా గెలుచుకుంది. దీంతో మొత్తం 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. ఈ గెలుపుతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. 
 
కాగా, రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన సింధు ఈసారి మొదటి మ్యాచ్ నుంచే పతక వేటలో పడింది. మునుముందు కూడా ఈ దూకుడును సింధు ఇలాగే కొనసాగిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments