Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకును విడిచిపెట్టి ఉండలేను... వీసా ఇప్పించండి... ప్లీజ్ : సానియా వేడుకోలు

Webdunia
గురువారం, 20 మే 2021 (14:29 IST)
ఒకవైపు కరోనా సీజన్ భయపెడుతుంటే.. మరోవైపు ఇంగ్లండ్‌లో టెన్నిస్ సీజన్ మొదలుకానుది. వచ్చే నెల 6వ తేదీ నుంచి నాటింగ్‌హామ్‌ ఓపెన్ టెన్నిస్ సిరీస్ ఆరంభంకానుంది. ఆ ఈవెంట్‌లో భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా పాల్గొనున్న‌ది. 
 
అయితే ఇప్ప‌టికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇంగ్లండ్ వెళ్లేందుకు వీసా వ‌చ్చింది. కానీ క‌రోనా ఆంక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో ఆమె రెండేళ్ల కుమారుడికి మాత్రం వీసా రాలేదు. అంతేకాదు.. సానియా కేర్‌టేక‌ర్‌కు కూడా ఇంకా వీసా జారీ చేయ‌లేదు. 
 
ఇంగ్లండ్‌లో వేరువేరు టోర్నీలు ఆడ‌నున్న సానియా అక్క‌డే నెల రోజుల‌కుపైగా గ‌డ‌ప‌నున్న‌ది. అయితే నెల రోజుల త‌న కొడుకును విడిచిపెట్టి ఉండ‌లేన‌ని, అందుకే త‌న కుమారుడిని కూడా తీసుకువెళ్లేందుకు అనుమ‌తి ఇప్పించాలంటూ కేంద్ర క్రీడాశాఖ‌ను సానియా ఆశ్ర‌యించింది.
 
ఈ నేప‌థ్యంలో జోక్యం చేసుకున్న క్రీడాశాఖ‌.. ఈ విష‌యాన్ని కేంద్ర విదేశాంగ‌శాఖ‌కు చెప్పింది. సానియా కుమారుడికి వీసా ఇప్పించే అంశంపై ఇంగ్లండ్‌తో కేంద్ర విదేశాంగ శాఖ చ‌ర్చ‌లు జ‌రుపుతుంది. బ్రిటన్ ప్రభుత్వం అనుమ‌తి ఇస్తుంద‌ని ఆశాభావాన్ని క్రీడాశాఖ వ్య‌క్తం చేసింది. 
 
నాటింగ్‌హామ్ ఓపెన్ త‌ర్వాత‌.. సానియా అక్క‌డే 14 నుంచి బ‌ర్మింగ్‌హామ్ ఓపెన్‌, 20 నుంచి ఈస్ట్‌బౌర్న్ ఓపెన్‌, 28వ తేదీ నుంచి వింబుల్డ‌న్ ఓపెన్‌లో ఆడ‌నున్న‌ది. కాగా సానియా మీర్జా పాకిస్థాన్ కోడలు అయినప్పటికీ.. భారత టెన్నిస్ క్రీడాకారిణిగా ఆడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments