Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనా నెహ్వాల్ మళ్లీ గురువుకు చేరువైంది.. గోపిచంద్ అకాడమీలో మళ్లీ ట్రైనింగ్

ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మెరుగ్గా ఆడకపోవడం ద్వారా పరాజయం పాలవుతోంది. దీంతో కోచ్‌ను మార్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సైనా నెహ్వాల్ మూడేళ్ల విరామం త

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (11:09 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మెరుగ్గా ఆడకపోవడం ద్వారా పరాజయం పాలవుతోంది. దీంతో కోచ్‌ను మార్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సైనా నెహ్వాల్ మూడేళ్ల విరామం తర్వాత శిక్షణ కోసం గోపీచంద్ అకాడమీలో చేరింది. గతవారం గ్లాస్గోలో వరల్డ్ ఛాంపియన్‌ఫిప్ సందర్భంగా కోచ్‌తో మాటలు కలిపిన సైనా.. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. 
 
మూడేళ్ల మూడేళ్ల క్రితం గోపీచంద్ అకాడమీని వీడిన సైనా నెహ్వాల్.. 2014, సెప్టెంబర్ 2 నుంచి బెంగళూరులో విమల్ కుమార్ దగ్గర శిక్షణ పొందింది. విమల్ దగ్గర ఉన్న సమయంలోనే సైనా వరల్డ్ నెంబర్ వన్‌గా అవతరించింది. ఆల్ ఇంగ్లండ్ ఫైనల్ చేరడంతోపాటు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించింది. కానీ గాయాల కారణంగా ఆమె ఆటతీరు కాస్త మందగించింది. 
 
అంతకుముందు గోపిచంద్ శిక్షణలో రాటుదేలిన సైనా నెహ్వాల్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది. కోచ్‌గా గోపిచంద్, క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్.. బ్యాడ్మింటన్‌‍కు చక్కని గుర్తింపు తీసుకొచ్చారు. కానీ గత మూడేళ్ల పాటు సైనా చిన్ననాటి కోచ్ గోపిచంద్‌కు దూరంగా వుంది. గోపిచంద్ ట్రైనింగ్‌కు దూరమైన సైనా నెహ్వాల్, మళ్లీ సొంత గూటికి చేరుకుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments