Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు పోగొట్టుకున్న శ్రీలంక... భారత్ క్లీన్ స్వీప్

సొంతగడ్డపై శ్రీలంక పరువు పోయింది. భారత్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక పోయింది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతోనూ, వన్డే సిరీస్‌ను 5-0తో భారత్‌కు అప్పగించింది.

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (06:15 IST)
సొంతగడ్డపై శ్రీలంక పరువు పోయింది. భారత్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక పోయింది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతోనూ, వన్డే సిరీస్‌ను 5-0తో భారత్‌కు అప్పగించింది. 
 
ఆదివారం రాత్రి కొలంబో వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో లంకేయులపై సునాయాస విజయాన్ని నమోదు చేసారు. ఫలితంగా వ‌న్డే సిరీస్‌ను 5-0తో కైవ‌సం చేసుకుంది. శ్రీలంక‌పై ఐదు వ‌న్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2014లోనూ భార‌త్ శ్రీలంక‌పై 5-0తో గెలిచింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 238 ప‌రుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత 239 రన్స్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. కెప్టెన్ కోహ్లి సెంచ‌రీ, కేదార్ హాఫ్ సెంచ‌రీ సాయంతో సునాయాసంగా గెలిచారు. 
 
46.3 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. విరాట్‌, జాద‌వ్‌ నాలుగో వికెట్‌కు 109 ర‌న్స్‌ పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పారు. చేజింగ్‌లో ఓపెన‌ర్లు ర‌హానే, రోహిత్ వికెట్ల‌ను త్వ‌ర‌గానే కోల్పోయినా.. కెప్టెన్ విరాట్‌, మ‌నీష్ పాండే, కేదార్ జాద‌వ్ టీమ్‌ను గెలుపుబాట ప‌ట్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments