ఖాళీగా వున్నాం.. అందుకే ఆ ఒక్క రోజులో పెళ్లి చేసుకోబోతున్నాం..

బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. డిసెంబర్ 16న తాము వివాహం చేసుకోబోతున్నట్లు సైనా స్పష్టం చేసింది. తొలిసారిగా తన కాబోయే భర్త పారుపల్లి కశ్యప్‌తో

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (15:31 IST)
బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. డిసెంబర్ 16న తాము వివాహం చేసుకోబోతున్నట్లు సైనా స్పష్టం చేసింది. తొలిసారిగా తన కాబోయే భర్త పారుపల్లి కశ్యప్‌తో ప్రేమ వివాహం గురించి సైనా నోరు విప్పింది.


2007లో ఓ టోర్నీలో కలిశామని.. ఆ ప్రయాణం మమ్మల్ని కలిపిందని.. టోర్నీలతో బిజీబిజీగా వున్నా.. అప్పుడప్పుడూ మాట్లాడేందుకు సన్నిహితంగా మెలిగే అవకాశం తమకు దక్కిందని ఆమె తెలిపింది. అయితే పెళ్లి ఆలోచన మాత్రం తమకు ఎప్పుడూ రాలేదని కూడా సైనా వివరించింది. 
 
ప్రస్తుతం టైమ్ దొరకడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించామని.. డిసెంబర్ 16నే పెళ్లి తేదీని ఎందుకు ఫిక్స్ చేశామంటే..? డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాను. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. ఆ రోజు మాత్రమే మాకు ఖాళీ దొరికింది. అందుకే ఆ తేదీనే ఫిక్స్ చేసుకున్నామని సైనా వివరించింది.
 
ఇన్నాళ్లూ టోర్నీలు గెలవడంపైనే దృష్టి పెట్టామని.. పెళ్లి తర్వాత తనపై బాధ్యత పెరుగుతుందని సైనా తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వద్దనుకున్నాం. కానీ ఖాళీ దొరకడంతో  పెళ్లికి సిద్ధమయ్యామని చెప్పింది. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా రాలేదని, వాళ్లే అర్థం చేసుకున్నారని సైనా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

తర్వాతి కథనం
Show comments