Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ ఖాతాలో వందో టైటిల్.. అదుర్స్

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (12:32 IST)
ప్రపంచ టెన్నిస్‌లో పలు రికార్డులు సొంతం చేసుకున్న స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో అద్భుత రికార్డును నమోదు చేసుకున్నాడు. శనివారం తన కెరీర్‌లో వందో సింగిల్స్‌ టైటిల్‌ సాధించాడు. దుబాయ్‌లో జరిగిన ఏటీపీ అంతర్జాతీయ టెన్నిస్ ఫైనల్లో భాగంగా ఏడో సీడెడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్.. 11 సీడెడ్ గ్రీస్‌ యువ కెరటం సిట్సిపాస్‌ను మట్టికరిపించాడు. 
 
ఫైనల్లో ఫెడరర్‌ 6–4, 6–4తో ప్రపంచ పదో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ను అలవోకగా ఓడించి ఈ టైటిల్‌ను ఎనిమిదోసారి సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో కెరీర్‌ వందో టైటిల్‌ రికార్డునూ అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న ఫెదరర్, ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఇక సిట్సిపాస్‌‌తో జరిగిన వందో మ్యాచ్‌లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. అమెరికాకు చెందిన జిమ్మీ అనే క్రీడాకారుడు 109 టైటిల్స్‌తో అగ్రస్థానంలో వుండగా.. 100 టైటిల్స్‌తో ఫెదరర్ జిమ్మీకి తర్వాతి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో నెటిజన్లు, అభిమానుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments