Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుండే రియో ఒలింపిక్స్ ప్రారంభం... భారత భాగ్య విజేతలెవరో...?!!

నాలుగేళ్లకోసారి జరిగే ‘క్రీడా పప్రంచ యుద్ధం’ ఒలింపిక్స్‌. ఈ ఏడాది ఒలింపిక్స్-2016కు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ రాజధాని రియో డిజనీరో సర్వం సిద్ధమైంది. సాంకేతికంగా శుక్రవారం నుంచే ఒలింపిక్స్‌ ప్రారంభమవుతాయి. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజాము

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (11:49 IST)
నాలుగేళ్లకోసారి జరిగే ‘క్రీడా పప్రంచ యుద్ధం’ ఒలింపిక్స్‌. ఈ ఏడాది ఒలింపిక్స్-2016కు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ రాజధాని రియో డిజనీరో సర్వం సిద్ధమైంది. సాంకేతికంగా శుక్రవారం నుంచే ఒలింపిక్స్‌ ప్రారంభమవుతాయి. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఒలిపింక్‌ వేడుకలు మొదలవుతాయి. సరదాలు, సందళ్లు, నృత్యాలకు పేరొందిన ‘సాంబా’ సామ్రాజ్యంలో పతకాల వేట ప్రారంభమవుతుంది. ఒలింపిక్స్‌కు దక్షిణ అమెరికా ఖండం ఆతిథ్యం ఇస్తుండటం ఇదే మొదటిసారి. ‘రియోత్సవం’లో భారత క్రీడకారులు 120 మంది పాల్గొంటున్నారు.
 
జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నా.. ఒలింపిక్స్‌ పతకాలు సాధించడంలో భారత ఎప్పుడూ అట్టడుగు స్థానాల్లో నిలుస్తూ వస్తోంది. హాకీలో మన స్వర్ణ యుగం ముగిశాక విశ్వ క్రీడల్లో ఒకటీఅరా పతకాలతో సంతృప్తిపడుతున్న భారత.. బీజింగ్‌లో మాత్రం మరో మెట్టెక్కింది. షూటింగ్‌లో వ్యక్తిగత స్వర్ణం(అభినవ్‌ బింద్రా)తో పాటు మొత్తం మూడు పతకాలు సాధించి మెరుగైన ప్రదర్శన చేసింది. 
 
ఆ తర్వాత లండన్‌ గేమ్స్‌లో మొత్తం ఆరు పతకాలతో బీజింగ్‌ మెడల్స్‌ సంఖ్యను రెట్టింపు చేసింది. ఇక రియోలో ఆ సంఖ్యను మరోసారి డబుల్‌ చేసే అవకాశం ఉంది. రియో విశ్వ క్రీడల కోసం మునుపెన్నడూ లేనంతగా భారీ బృందాన్ని భారత్ పంపింది. 15 క్రీడాంశాల్లో భారత్‌ పోటీ పడుతోంది. ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం మొదలయ్యేది శనివారం తెల్లవారు జామునే అయినా భారత ఆర్చరీ జట్టు విశ్వక్రీడల పోరాటం శుక్రవారమే ప్రారంభించనుంది. సాయంత్రం ఐదు గంటలకు మొదలయ్యే పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత ఆర్చర్‌ అతాను దాస్‌ పోటీ పడనున్నాడు. రాత్రి 9.30 గంటలకు మొదలయ్యే మహిళల టీమ్‌, వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో దీపికా కుమారి, బొంబ్యాల దేవి, లక్ష్మీరాణి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

తర్వాతి కథనం
Show comments