Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11: తమిళ్‌ తలైవాస్‌ భారీ విజయం, 44-25తో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపు

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (21:30 IST)
తమిళ్‌ తలైవాస్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ను 44-25తో చిత్తు చేసి ఏకంగా 19 పాయింట్ల భారీ తేడాతో తమిళ్‌ తలైవాస్‌ ఘన విజయం నమోదు చేసింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ-కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌ అదరగొట్టింది. సీజన్‌లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. తలైవాస్‌ స్టార్‌ రెయిడర్‌ నరేందర్‌ 20 సార్లు కూతకెళ్లి 15 పాయింట్లు సాధించగా.. సచిన్‌ (5 పాయింట్లు), డిఫెండర్‌ నితేశ్‌ కుమార్‌ (4 పాయింట్లు), ఆమీర్‌ ( 4 పాయింట్లు) రాణించారు. గుజరాత్‌ జెయింట్స్‌ ఆటగాళ్లలో గుమన్‌ సింగ్‌ ఏడు పాయింట్లు సాధించగా, రాకేశ్‌ మూడు పాయింట్లతో మెరిశాడు. పీకెఎల్‌ 11లో నాలుగు మ్యాచుల్లో గుజరాత్‌ జెయింట్స్‌కు ఇది మూడో పరాజయం. 
 
ఆకట్టుకున్న తలైవాస్‌: 
గుజరాత్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ప్రథమార్థం తొలి పది నిమిషాల్లో ఆధిపత్యం కోసం ఇరు జట్లు గట్టిగా పోటీపడ్డాయి. 11-9తో తమిళ్‌ తలైవాస్‌ పైచేయి సాధించింది. కానీ గుజరాత్‌ జెయింట్స్‌ రెట్టించిన ఉత్సాహంతో పోరాడింది. డిఫెన్స్‌లో తలైవాస్‌తో సమవుజ్జీగా నిలిచినా.. రెయిడింగ్‌లో జెయింట్స్‌ వెనుకంజ వేసింది. తలైవాస్‌ స్టార్‌ రెయిడర్‌ నరేందర్‌, సచిన్‌ మెరువగా.. గుజరాత్‌ జెయింట్స్‌ రెయిడర్లలో గుమన్‌ సింగ్‌ మాత్రమే మెప్పించాడు. దీంతో ప్రథమార్థం ఆట ముగిసేసరికి తమిళ్‌ తలైవాస్‌ 18-14తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. 
 
తలైవాస్‌ దూకుడు: 
విరామం అనంతరం తమిళ్‌ తలైవాస్‌ దూకుడు పెంచింది. తొలి 20 నిమిషాల్లో సాధించిన ఆధిక్యాన్ని.. ద్వితీయార్థంలో తొలి పది నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. ప్రథమార్థంలో ఆలౌట్‌ కాకుండా జాగ్రత్త పడిన గుజరాత్‌ జెయింట్స్‌ సెకండ్‌ హాఫ్‌లో చేతులెత్తేసింది. జెయింట్స్‌ కోర్టు ఖాళీ చేసిన తలైవాస్‌ విలువైన ఆలౌట్‌  పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆఖరు నిమిషంలో గుజరాత్‌ జెయింట్స్‌ను మరోసారి ఆలౌట్‌ చేసిన తమిళ్‌ తలైవాస్‌ ఏకపక్ష ప్రదర్శన చేసింది.  చివరి 20 నిమిషాల ఆటలో తమిళ్‌ తలైవాస్‌ 26 పాయింట్లు సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ కేవలం 11 పాయింట్లే సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments