Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్.. 2,848 కొత్త కోవిడ్-19 కేసులు.. రికార్డు స్థాయిలో నమోదు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (16:17 IST)
ఓ వైపు జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతుండగా.. మరోవైపు కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టోక్యోలో మంగళవారం 2,848 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి జపాన్ రాజధానిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిశారని అధికారులు తెలిపారు.
 
అయితే.. కోవిడ్-19 నిబంధనల మధ్య టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా కరోనాలోని డెల్టా వేరియంట్ కారణంగానే వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోందని.. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. 
 
దీంతోపాటు కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నమోదైన 12,635 కోవిడ్ -19 కేసుల్లో.. 20.8% మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారని.. టోక్యోలో మహమ్మారి నియంత్రణకు అత్యవసర పరిస్థితిని విధించడం నయమంటూ అధికారుల ప్యానెల్ ప్రభుత్వానికి సూచించింది.
 
ఇదిలాఉంటే.. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో కూడా కరోనా ఆందోళనకు గురిచేస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ గ్రామంలో మంగళవారం 7 కొత్త కేసులు నమోదైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. వారిలో నలుగురు అథ్లెట్లు, మరో ఇద్దరు సహాయకులని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments