Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారథాన్ రన్నర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (10:16 IST)
పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న మారథాన్ రన్నర్‌కు ఆమె ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో చోటుచేసుకుంది. ఈ దేశానికి చెందిన రెబెక్కా చెప్టెగీ గత కొన్ని రోజులుగా కెన్యాకు చెందిన డిక్కన్ డియెమ మరగ‌చ్‌తో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో తరచూ ఆమెను వేధింపులకు గురిచేస్తున్న మరగచ్.. ఇటీవల ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటల ధాటికి రెబెక్కా హాహాకారాలు చేయడంతో స్థానికులు ఆమెను కెన్యాలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఆమె దాదాపు 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాటం చేస్తుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రెబెక్కాపై దాడి విషయం తెలిసి ఉగాండా ప్రజలతో పాటు ఒలింపిక్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు డెయెమ మరగచ్‌పై గృహహింస, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments