Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త చరిత్రను లిఖించిన లాంగ్ జంపర్ శ్రీశంకర్

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (08:56 IST)
కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ శ్రీశంకర్ లాంగ్ జంపర్ విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. లాంగ్ జంప్‌ ఫైనల్స్ విభాగంలో ఈ కేరళ కుర్రోడు మురళీ శ్రీశంకర్ తన ఐదో ప్రయత్నంలో ఏకంగా 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఇక బహమాన్‌కు చెందిన లకాన్ నైర్న్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
నిజానికి ఈ క్రీడల్లో భారత అథ్లెట్స్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఫలితంగా భారత ఖాతాలో వివిధ రకాల పతకాలు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా బుధవారం హైజంప్‌లో తేజస్విని శంకర్ కాంస్య పతకం గెలిస్తే, గురువారం లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజతం గెలుచుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఈ రెండు విభాగాల్లో భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. 
 
అయితే, గురువారం జరిగిన లాంగ్ జంప్‌ ఫైనల్స్ పోటీల్లో కేరళ యువకుడు మురళీ శ్రీశంకర్ తన ఐదో ప్రయత్నంలో ఏకంగా 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలించాడు. బహమాన్‌కు చెందిన లకాన్ నైర్న్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 
 
అయితే, లకాన్ కూడా 8.08 మీటర్లే దూకినప్పటికీ అతని రెండో బెస్ట్ అటెమ్ట్ (7.98 మీటర్లు) శ్రీశంకర్ (7.84 మీటర్లు) కంటే మెరుగ్గా ఉండటంతో మొదటిస్థానం దక్కించుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో లాంగ్ జంప్ విభాగంలో భారత్‌ పతకం సాధించిన రెండో ఆటగాడిగా శ్రీశంకర్ నిలిచాడు. 
 
నిజానికి గత 1978లో కెనడాలో జరిగిన ఈ క్రీడల్లో సురేశ్ కాంస్య పతకం గెలుపొందాడు. ఆ తర్వాత లాంగ్ జంప్‌లో భారత్‌కు కామన్వెల్త్ క్రీడల్లో పతకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 8 మందిరోగుల సజీవదహనం

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్-9 సీజన్ : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో... తెలుసా?

80s Reunion heros and heroiens: స్నేహం, ఐక్యత కు ఆత్మీయ వేదిక 80s స్టార్స్ రీయూనియన్‌

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

తర్వాతి కథనం
Show comments