Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిందని బలవన్మరణం.. ఇక బతకలేనని తెలుసుకుని..?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (16:38 IST)
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ్యాధిగ్రస్థులను చూస్తే ఆమడ దూరంలో పారిపోతున్నారు జనం. అలాంటిది కరోనా బాధితులను పక్కనుండి చూస్తూ వారికి సేవలు అందిస్తున్నారు వైద్యులు, నర్సులు. దీంతో వారిలో కొందరు కరోనా బారిన పడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ బారిన పడిన ఓ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ ఫ్రాన్స్‌లో విజృంభిస్తుండటంతో ఇప్పటివరకూ ఎనిమిది వేలకు మందికి పైగా మృత్యువాత పడ్డారు.
 
ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌లో భాగంగా ఓ క్లబ్‌ జట్టుకు డాక్టర్‌గా ఉన్న బెర్నార్డ్‌ గోంజ్‌లెజ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టైన లిగీ-1 రీమ్స్‌ డాక్టర్‌ బెర్నార్డ్‌ గోంజెలెజ్‌కు కరోనా వైరస్‌ సోకింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన అతనికి టెస్టుల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది ఆ దేశ ఫుట్‌బాల్‌ రంగాన్ని కలవరపాటుకు గురిచేసింది.
 
ఇక తాను బ్రతకనని భావించే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని రీమ్స్‌ మేయర్‌ అర్మౌడ్‌ రాబినెట్‌ అనుమానం వ్యక్తం చేశారు. తమ ఫుట్‌బాల్‌ కుటుంబం ఒక మంచి డాక్టర్‌ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments