Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా సోకిన ఉగ్రవాదులు భారత్‌లోకి.. ఐదుగురు హతం.. పాక్ బుద్ధి మారదా?

Advertiesment
coronavirus
, సోమవారం, 6 ఏప్రియల్ 2020 (16:20 IST)
కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధి ప్రపంచాన్ని కుదిపేస్తున్నా.. పాకిస్థాన్ బుద్ధి మాత్రం మారలేదు. ఏ అవకాశం వచ్చిన దాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలనుకుంటున్న పాకిస్థాన్.. తాజాగా కరోనా మహమ్మారిని కూడా వాడేసుకుంది. కరోనా అస్త్రంగా చేసుకుని భారత సైన్యాన్ని దెబ్బతీయాలని పాకిస్థాన్ ఆర్మీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
పీఓకేలో పాక్ సైనికులతో టచ్‌లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులకు కరోనా సోకింది. సుమారు 800 మంది కరోనా పీడిత ఉగ్రవాదులను నియంత్రణ రేఖ దాటించాలని పాక్ ఆర్మీ తాజా లక్ష్యం పెట్టుకుంది. భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించే కరోనా పీడిత ఉగ్రవాదుల ద్వారా ఇండియన్ ఆర్మీని దెబ్బతీయాలని చూస్తున్నట్లు నిఘావర్గాలు పసిగట్టాయి. ఐఎస్ఐ అధికారుల నేతృత్వంలో ఈ కుట్ర అమలు పర్యవేక్షణ జరుగుతోందని అనుమానిస్తున్నారు. 
 
దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ.. జమ్మూకాశ్మీర్‌లో ఎల్‌ఓసీని దాటి భారత భూభాగంలోకి చొచ్చుకొస్తోన్న 9 మంది ఉగ్రవాదులను గత 48 గంటల్లో మట్టుబెట్టింది. కరోనాతో దెబ్బతీయాలనుకుంటోన్న పాకిస్థాన్ కుట్రను సమర్థంగా తిప్పికొడుతామని భారత సైన్యం చెబుతోంది.
 
ఉత్తర కాశ్మీర్‌లోని కెరన్ సెక్టార్‌ గుండా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదాలను సైనికులు అంతమొందించారు. ఆదివారం నాడు జరిగిన ఈ దాడిలో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. అయితే.. ఈ క్రమంలో మరో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. సైనికుల్లో సుబేదార్ సంజీవ్ కుమార్(హిమాచల్ ప్రదేశ్), హవల్దార్ దేవేంద్ర సింగ్(ఉత్తరాఖండ్), పారా ట్రూపర్ బాలకృష్ణన్(హిమాచల్ ప్రదేశ్), పారా ట్రూపర్ అమిత్ కుమార్(ఉత్తరాఖండ్), ఛత్రపాల్ సింగ్(రాజస్థాన్) అమరులయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడి కోసం భర్తను లారీతో ఢీకొట్టి చంపేసింది.. ఎక్కడ?