Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఓపెన్ : తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్‌ విజేతగా తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారుడు కెంటా నిషిమోటోపై 21-14,

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (09:25 IST)
ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్‌ విజేతగా తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారుడు కెంటా నిషిమోటోపై 21-14, 21-13 తేడాతో గెలుపొందాడు. గత వారం డెన్మార్క్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకున్న శ్రీకాంత్‌.. వరుసగా రెండో టైటిల్‌ సాధించడం విశేషం. శ్రీకాంత్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. ఆరంభంలో మాత్రం పోటాపోటీగా సాగింది. 
 
ఈ విజయంపై శ్రీకాంత్ స్పందిస్తూ, ‘టాప్‌ ర్యాంక్‌ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. వరుస విజయాలతో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తానని అనుకుంటున్నా. కానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే అక్సెల్‌సెన్‌కు నాకు పాయింట్ల అంతరం చాలా ఉంది. టాప్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం ఆనందమే కానీ.. దానిపైనే దృష్టిపెట్టను. ప్రస్తుత ఫామ్‌పై సంతోషంగా ఉన్నా.. భవిష్యత్‌ టోర్నీలపై కోచ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటా’నని మ్యాచ్‌ అనంతరం శ్రీకాంత్‌ చెప్పాడు.
 
ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన శ్రీకాంత్‌ను తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. వరుస విజయాలతో శ్రీకాంత్‌.. తెలుగు రాష్ట్రాలకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చాడని కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments