Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్ కోసం రూ.810 కోట్లు ఖర్చు.. వచ్చిన పతకాలు 2.. ఇది మన భారత్ తీరు

రియో ఒలింపిక్స్ క్రీడల కోసం భారత్ అక్షారాలా 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కానీ, భారత క్రీడాకారులు తెచ్చిన పతకాలు కేవలం రెండే రెండు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు రజ

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (16:48 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల కోసం భారత్ అక్షారాలా 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కానీ, భారత క్రీడాకారులు తెచ్చిన పతకాలు కేవలం రెండే రెండు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు రజత పతకం గెలుచుకోగా, మహిళల రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మిగిలిన ఏ ఒక్క క్రీడాకారుడు కూడా అంచనాలకు తగిన విధంగా రాణించలేదు. ఫలితంగా రియో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 69వ స్థానంలో నిలిచింది. 
 
మన దేశం రియో ఒలింపిక్స్ క్రీడాకారులు, శిక్షణ కోసం మొత్తం 810 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని గత నాలుగేళ్ల కాలంలో ఖర్చు చేశారు. శిక్షణా సెంటర్లు, కోచ్‌లు, ఇతర మౌలిక సౌకర్యాల కోసం 750 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగా, నేషనల్ స్పోర్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ప్రోగ్రామ్ కార్యక్రమం కింద 38 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంటే మొత్తం దాదాపు 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 
 
అదేసమయంలో రియో ఒలింపిక్స్‌లో రాణించి 67 పతకాలను గెలుచుకొని ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిన బ్రిటన్‌.. పతకాల సాధన కోసం క్రీడాకారులపై ఖర్చు పెట్టిన రూ.2747 కోట్లు. అంటే ఒక్కో మెడల్ కోసం సగటున 41 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టు బ్రిటన్ స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. బ్రిటన్ బడ్జెట్ కేటాయింపులను పరిశీలించగా ఈ నాలుగేళ్లలో ఒలింపిక్స్ ప్రిమరేషన్స్ కోసం క్రీడాకారుల శిక్షణ, శిక్షణా వసతుల కోసం మొత్తం 2,380 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments