Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిల్వర్ స్టార్' సింధుకు బెజవాడలో ఘనస్వాగతం... క్యూకట్టిన మంత్రులు, టీడీపీ నేతలు

రియో సిల్వర్ స్టార్ పీవీ సింధుకు బెజవాడలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బేగంపేటకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఘన స్వాగ

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (11:42 IST)
రియో సిల్వర్ స్టార్ పీవీ సింధుకు బెజవాడలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బేగంపేటకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. 
 
నిజానికి రియో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించిన సింధు.. సోమవారం ఉదయం బ్రెజిల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న విషయంతెల్సిందే. ఆమెకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికి సన్మానించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మంగళవారం స్వాగతం పలికి సన్మానించనుంది. 
 
మంగళవారం ఉదయం విజయవాడ చేరుకున్న రజత పతక విజేతకు హైదరాబాదులో కంటే ఘనంగా స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేందుకు ఆమెకు ఏపీ సర్కారు ఓ ప్రత్యేక విమానాన్నే ఏర్పాటు చేసింది. బెజవాడ ఎంపీ కేశినేని దగ్గరుండి మరీ ఆమెను విజయవాడ తీసుకెళ్లారు. 
 
ఇక గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వరకు జరుగుతున్న ర్యాలీకి ఏపీ జనం బ్రహ్మరథం పట్టారు. ర్యాలీ సాగుతున్నంతసేపు రోడ్డుకు ఇరువైపులా నిలబడిన జనం... సింధుకు జేజేలు పలికారు. వెరసి సిల్వర్ స్టార్ సింధుకు హైదరాబాదులో కంటే విజయవాడలోనే ఘన స్వాగతం లభించినట్లైంది. 
 
మరోవైపు... సింధుకు విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టులో ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రత్యేక విమానంలో తన కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఆమెకు సాదర స్వాగతం లబించింది. సింధుకు స్వాగతం పలికేందకు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు క్యూ కట్టారు. 
 
ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తదితరులు సింధుకు స్వాగతం పలికారు. ఇక బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానం వద్ద సింధుకు స్వాగతం పలికిన బెజవాడ ఎంపీ కేశినేని నాని ఆమెను వెంటబెట్టుకుని విజయవాడకు తీసుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

తర్వాతి కథనం
Show comments