Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెన్మార్క్‌ ఓపెన్‌: క్వార్టర్‌ ఫైనల్‌కు పీవీ సింధు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (21:37 IST)
భారత సీనియర్‌ షట్లర్‌, భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ పీవీ సింధు డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రత్యర్థితో జరిగిన మూడు గేమ్‌లలో దూసుకుపోయింది. సింధు 67 నిమిషాల్లో 21-16, 12-21, 21-15 తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమృంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్.
 
భారతదేశపు గొప్ప ఒలింపియన్లలో ఒకరైన సింధు ఈ టోర్నమెంట్‌తో పునరాగమనం చేయడానికి ముందు కొంత కాలం విశ్రాంతి తీసుకున్నది. భారతదేశానికి చెందిన మరో స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్ డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించారు. లక్ష్య సేన్ 16 వ రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 విక్టర్ ఆక్సెల్సన్‌తో పోటీ పడగా, సమీర్ వర్మ ఆతిథ్య దేశానికి చెందిన ఆండర్స్ అంటోన్సెన్‌తో ఆడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

తర్వాతి కథనం
Show comments