Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌లో సింధూ ప్రతిభ అమోఘం : చాముండేశ్వరినాథ్‌

రియో ఒలింపిక్స్ క్రీడల్లో పి.వి.సింధు కనబరిచిన ప్రతిభ అమోఘమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్‌ కొనియాడారు. సింధుకి చిన్న వయసే కనుక జీవితంలో మరిన్ని విజయాలు

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (12:37 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో పి.వి.సింధు కనబరిచిన ప్రతిభ అమోఘమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్‌ కొనియాడారు. సింధుకి చిన్న వయసే కనుక జీవితంలో మరిన్ని విజయాలు సాధిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
తిరుమల శ్రీవారిని ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో దర్శించుకున్న చాముండేశ్వరినాథ్‌ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అలాగే ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
రియో ఒలింపిక్స్ క్రీడల్లో మంగళవారం రాత్రి జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్లో సింధు  21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడిన విషయం తెల్సిందే. దీంతో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలి గేమ్ను గెలిచిన సింధు.. ఆపై వరుస రెండు గేమ్లలో ఒత్తిడికి‌లోనై ఓటమి చెందింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

తర్వాతి కథనం
Show comments