Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్వర్ సింధూపై కాసుల వర్షం... కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా..

రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టిన తెలుగమ్మాయి, భారత షట్లర్ పివి సింధుపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించగా, ఢిల

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (11:18 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టిన తెలుగమ్మాయి, భారత షట్లర్ పివి సింధుపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆమెకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. 
 
ఒలింపిక్స్లో రజతం సాధించినందుకుగాను రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే, మహిళల రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్కు కోటి రూపాయిలను ఇవ్వనున్నట్లు తెలిపింది. 
 
అలాగే, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటించింది. 
 
కాగా, ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్లో సింధు  21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ స్పెయిన్ క్రీడాకారిణి కరోలిన్ మరిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్న విషయం తెల్సిందే. దీంతో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments