Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ మాంబా మృతిపట్ల డోనాల్డ్ ట్రంప్ విచారం

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (11:25 IST)
ప్రపంచ బాస్కెట్ బాల్ దిగ్గజం, ఎన్బీఏ లెజండ్ కోబ్ బ్రియాంట్ మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ శివారులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బ్రియాంట్, ఆయన 13 ఏళ్ల కూతురు గియానా సహా 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 
 
దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయినట్టు పేర్కొంటూ, తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. దేశంలో బాస్కెట్ బాల్ విస్తరణ, అభివృద్ధికి బ్రియాంట్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఈ దుర్ఘటన అమెరికా క్రీడా చరిత్రలోనే అత్యంత విషాదకరమైనదని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
బ్రియాంట్ మృతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, 'బ్రియాంట్‌, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

తర్వాతి కథనం
Show comments