Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాస్కెట్‌బాల్ లెజెండ్ 'బ్లాక్ మాంబా' దుర్మరణం...

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (09:14 IST)
ప్రపంచంలో బాస్కెట్ బాల్ దిగ్గజంగా పేరుగడించిన కోబ్ బ్రియాంట్ అర్థాంతరంగా కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి లోనుకావడంతో ఆయన మంటల్లో కాలిబూడిదైపోయారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు మరో ఎనిమిది మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాస్కెట్ బాల్ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 
 
బాస్కెట్ బాల్ లెజండ్‌గా పేరు తెచ్చుకున్న కోబ్ బ్రియాంట్ అమెరికన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ - ఎన్బీఏ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరిగా ఉన్నారు. ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ హెలికాఫ్టర్‌లో బయలుదేరగా అది లాస్ ఏంజిల్స్‌కు అతి సమీపంలో అదుపుతప్పి కుప్పకూలింది. 
 
నగర శివార్లలోని నిర్జన ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ మొత్తం కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. హెలికాప్టరులోని మృతదేహాలన్నీ గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. 
 
'బ్లాక్ మాంబా'గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో సుప్రసిద్ధుడైన కోబ్, దాదాపు 20 సంవత్సరాలకు పైగా క్రీడాభిమానులను అలరించారు. చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన టాప్-3 ప్లేయర్లలోనూ చోటు దక్కించుకున్నారు. ఆయన వయసు 41 సంవత్సరాలు. కోబ్ మృతిపట్ల ఎన్బీఏ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments