Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో పాపం.. జిమ్నాస్టిక్స్ చేస్తుంటే కాళ్లు రెండూ విరిగిపోయాయి... (వీడియో)

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:56 IST)
జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు అందులో పాల్గొనే జిమ్నాస్ట్‌లకు కొన్నిసార్లు గాయాలు అవుతుంటాయి, కాళ్లు బెణుకుతుంటాయి. వాపులు వస్తుంటాయి. లేదంటే కండరాలు పట్టేస్తుంటాయి. అంతా సవ్యంగా సాగితే సరి, లేకపోతే ఏదైనా ప్రమాదం జరగొచ్చు. కాళ్లు చేతులు విరగవచ్చు, ఎముకలు విరగవచ్చు, కీళ్లు నొప్పులు కలగవచ్చు. ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. 
 
ఎంతో నేర్పరితనంతో వ్యవహరిస్తే కానీ ఇలాంటి క్రీడల్లో పాల్గొనలేరు. ఇలాంటి తర్ఫీదును తీసుకున్నప్పటికీ కూడా అమెరికాకు చెందిన సమంతా సెరియో అనే జిమ్నాస్ట్ నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోషియేషన్ (ఎన్సీఏఏ) బాటన్ రఫ్ రీజనల్ ఈవెంట్‌లో పాల్గొనే సమయంలో జిమ్ మ్యాట్‌పై ల్యాండ్ అయ్యే తరుణంలో మ్యాట్‌పై కాళ్లను సరిగా ల్యాండ్ చేయలేకపోయింది. 
 
ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లు మోకాళ్ల వరకు విరిగి పోయాయి. ఆమె నొప్పి, బాధతో ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసింది. అక్కడే ఉన్న టోర్నమెంట్ అధికారులు, అలాగే టీమ్ సభ్యులు సైతం ఆమెను అలాగే చూస్తుండిపోయారు. ఆమెను స్ట్రెచర్‌పై మోసుకుంటూ అక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్‌లో చేర్చారు. ఏది ఏమైనా అలాంటి సన్నివేశాలను చూసినప్పుడు మనకు భయంతో పాటు బాధకలుగుతుంది. ఆ వీడియోని మీరు ఓ సారి చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments