Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (14:28 IST)
ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. స్క్వాష్ పోటీలో దీపికా పల్లికల్, హరిందర్ సంధు జోడీ విజయం సాధించింది. ఈ జంట మలేషియాపై 11-10, 11-10 తేడాతో భారత జంట గెలుపొందింది. దీంతో భారత్ ఖాతాలోకి 20 బంగారు పతకాలకు చేరింది. 
 
మరోవైపు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రణయ్ కూడా మెడల్‌ను ఖాయం చేసుకున్నారు. సీనియర్ స్క్వాష్ ప్లేయర్ సౌరభ్ ఘోషల్ కూడా సింగిల్స్ విభాగంలో పతకంపై కన్నేశారు. అంతకుముందు అర్చరీలో కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ప్రస్తుతం భారత్‌ పతకాల సంఖ్య 83కి చేరింది. వీటిలో 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.
 
పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో భూటాన్‌పై 235-221 తేడాతో  విజయం సాధించింది. ఓజాస్‌ ప్రవిణ్‌-అభిషేక్-ప్రథమేష్ సమాధాన్‌తో కూడిన బృందం భూటాన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో సెమీస్‌లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడనుంది. బాక్సర్లు అంతిమ్‌ పంగల్‌ (మహిళల 53 కేజీల విభాగం), మన్సి (మహిళల 50 కేజీల విభాగం) కాంస్య పతకం కోసం తలపడనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ : ఏపీ సర్కారు తొలి కేబినెట్ నిర్ణయాలివే...

రానున్న మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

ఆ యాప్‌ డౌన్ లోడ్ చేయొద్దని చెప్పిన తండ్రి.. బాలిక ఆత్మహత్య

మీ బతుకంతా ఫేక్ ప్రచారమే.. తిట్టాలన్నా మాకు సిగ్గుగా ఉంది : వైకాపాకు టీడీపీ కౌంటర్

హజ్ యాత్రలో విషాదం.. ఈ యేడాదిలో 1301 మంది మృత్యువాత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

సుమ‌న్‌తేజ్, హెబ్బాప‌టేల్ న‌టించిన సందేహం మూవీ రివ్యూ

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'

తర్వాతి కథనం
Show comments