Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో రోజు వరుసగా లాభపడిన స్టాక్ మార్కెట్..

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (10:12 IST)
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ తొలుత 250 పాయింట్లు జంప్‌చేసింది. ప్రస్తుతం 217 పాయింట్లు బలపడి 38,745కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 60 పాయింట్లు ఎగసి 11,440 వద్ద ట్రేడవుతోంది. 
 
మంగళవారం అమెరికన్‌ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ఆసియాలో మార్కెట్లు ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను కైవసం చేసుకుంటున్నాయి. ఇంకా ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం, దేశీయంగా బలపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలు ఆర్జించాయి. 
 
ఇకపోతే.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ అత్యధికంగా 2.3 శాతం లాభపడగా... ఆటో, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ కాస్త పుంజుకున్నాయి. ఎస్‌బీఐ, హీరో మోటో, అదానీ పోర్ట్స్‌, ఇన్‌ప్రాటెల్‌, ఐసీఐసీఐ, గెయిల్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, జీ, ఐటీసీలు లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments