Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత రాష్ట్రపతి, ప్రధానిల విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానం, ధర ఎంతో తెలుసా?

భారత రాష్ట్రపతి, ప్రధానిల విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానం, ధర ఎంతో తెలుసా?
, సోమవారం, 10 ఆగస్టు 2020 (15:37 IST)
ఫోటో క్రెడిట్- మహంతి-ట్విట్టర్

దేశంలో ప్రధానమంత్రికి భద్రత అనేది అత్యంత సవాలుతో కూడిన విషయం. ఎంత సెక్యూరిటి ఉన్నా శత్రువుల బెడద తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత రాష్ట్రపతి, ప్రధానిలకు ఇక నుంచి ప్రత్యేకంగా ఎయిర్‌ఫోర్స్ వన్ ప్రత్యేక విమానాన్ని ఉపయేగించనున్నారు. భారత రాష్ట్రపతి, ప్రధానిల కోసం ప్రత్యేకంగా రెండు విమానాలు ఆర్డర్ పెట్టగా వచ్చే నెలలో ఒక విమానం రానున్నది.
 
ఇలాంటి ప్రత్యేకమైన విమానం ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది చాలా అధునాతన శక్తివంతమైనది. విమానానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వన్‌గా నామకరణం చేసారు. ఆకాశంలో ఎగురుతున్న ఈ విమానం చాలా సురక్షితం, శత్రువులు దాడులు చేయాలనుకున్నా ఏమీ చేయలేరు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే అదే విమానాన్ని ప్రధాని మోదీ ఉపయోగించనున్నారు.
 
ఇది బోయింగ్ 777 విమానం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం తయారుచేయబడిన ఈ విమానం తరువాతి భాగంలో EW జామర్ అమర్చబడింది. ఇది శత్రువు రాడార్ సిగ్నల్‌ను బ్లాక్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ సిగ్నల్‌ను బ్లాక్ చేస్తుంది. ఒకవేళ విమానం పైకి క్షిపణి ఉపయోగించినా పని చేయదు. విమానం పైకి క్షిపణి ఉపయోగించిన వెంటనే హెచ్చరిస్తుంది. అంతేకాకుండా క్షిపణి ఎంతదూరం ఎక్కడ నుండి వస్తుందన్న సమాచారాన్ని అందిస్తుంది.
 
అంతేకాకుండా హీట్ సింక్ క్షిపణి నుండి రక్షిస్తుంది. ఇది క్షిపణిని గందరగోళం చేస్తుంది. ఇది పూర్తి మిర్రర్ బాల్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది ఇన్‌ఫ్రా సిస్టమ్ నావిగేషన్ వ్యవస్థ ద్వారా నడుస్తుంది. ఇది వాటి సిగ్నల్‌ను అడ్డుకుంటుంది. దీనివల్ల క్షిపణి విఫలమవుతుంది. ఇందులో అత్యంత ఆధునిక సురక్షితమైన ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగి ఉంది. దీని ద్వారా ప్రధాని ప్రపంచంలో ఏ మూలనున్న వ్యక్తులతోనైనా మాట్లాడవచ్చు. ఇటువంటి రెండు విమానాలను ప్రదాని, రాష్ట్రపతిల కోసం తీసుకున్నారు. ఈ విమానం ధర సుమారు రూ. 8458 కోట్లుగా చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.2.50 కోట్ల భూమి రూ.25 లక్షలకే ఎలా ఇచ్చారు? తెలంగాణ హైకోర్టు