Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డ్- 18వేల ఎగువన?

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (10:19 IST)
దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి. వరుస లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లలో నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ తొలిసారిగా 18వేల ఎగువన ముగిసింది. ఆటో, పవర్‌, మౌలిక రంగాల షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకోవడంతో 169.80 పాయింట్లు లేదా 0.94 శాతం బలపడి మునుపెన్నడూ లేనివిధంగా 18,161.75 వద్ద స్థిరపడింది. 
 
ఒకానొక దశలో 18,197.80 స్థాయిని తాకి నయా ఇంట్రా-డే రికార్డునూ నిఫ్టీ నెలకొల్పింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ సైతం 452.74 పాయింట్లు లేదా 0.75 శాతం ఎగిసి ఆల్‌టైమ్‌ హై 60,737.05 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలోనూ 60,836.63 స్థాయికి ఎగబాకి నూతన రికార్డును సృష్టించింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ తదితర షేర్ల విలువ 5 శాతానికిపైగా పెరిగాయి.
 
స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదు రోజులు లాభాల్లోనే ముగియడంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ.2,70, 73,296. 03 కోట్లకు చేరింది. బుధవారం ఒక్కరోజే రూ.2,42,908.24 కోట్లు ఎగిసింది. మొత్తం ఈ ఐదు రోజుల్లో రూ.8,52, 748.98 కోట్లు ఎగబాకింది. సెన్సెక్స్‌ 1,547.32 పాయింట్లు పెరిగింది. మదుపరులకు టాటా మోటర్స్‌ షేర్లు కాసుల వర్షం కురిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments