Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వల్పంగా వర్తకం జరిపిన మార్కెట్లు; 16 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (20:44 IST)
నేటి ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్లు స్వల్పంగా ముగిశాయి. నిఫ్టీ 0.16% లేదా 16.40 పాయింట్లు తగ్గి 10, 288.90 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.08% లేదా 26.88 పాయింట్లు తగ్గి 34, 842.10 వద్ద ముగిసింది. సుమారు 1130 షేర్లు క్షీణించగా, 1477 షేర్లు పెరిగాయి, 158 షేర్లు మారలేదు.
 
ఐటిసి (5.55%), హీరో మోటోకార్ప్ (2.86%), బజాజ్ ఫైనాన్స్ (1.89%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.73%), హిందూస్తాన్ యూనిలీవర్ (1.26%) మార్కెట్లో అత్యధిక లాభాలను ఆర్జించాయి. మరోవైపు, నిఫ్టీ నష్టపోయిన వారిలో ఆసియా పెయింట్స్ (3.13%), హిండాల్కో ఇండస్ట్రీస్ (2.34%), ఐఒసి (2.12%), అదానీ పోర్ట్స్ (1.80%) మరియు శ్రీ సిమెంట్స్ (1.85%) ఉన్నాయి. ఎఫ్‌ఎంసిజి, ఫార్మా మినహా ఇతర రంగాలు ఎరుపు రంగులో వర్తకం చేస్తాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.62 శాతం, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.76 శాతం పెరిగింది.
 
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
నాల్గవ త్రైమాసికంలో హెచ్.ఎ.ఎల్, తన వార్షిక లాభంలో 0.9% పెరిగినట్లు నివేదించింది. కంపెనీ ఆదాయాలు 1.7% పెరిగి రూ. 10,323 కు చేరుకున్నాయి. కంపెనీ స్టాక్ 14.22% పెరిగి రూ. 798,00ల వద్ద ట్రేడ్ అయింది.
 
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
నాలుగో త్రైమాసికంలో రూ. 143.8 కోట్ల నికర లాభం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో 1985.20 కోట్లు గడించింది. ఈ సంస్థ యొక్క నికర వడ్డీ ఆదాయం 3.6% పెరిగింది, స్థూల ఎన్.పి.ఎ లు 14.8% వద్ద ఉన్నాయి. ఫలితంగా, కంపెనీ స్టాక్ 9.63% పెరిగి రూ. 11.95 ల వద్ద ట్రేడ్ అయింది.
 
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత కంపెనీ స్టాక్ 1.64% పెరిగి రూ.155.30 ల వద్ద ట్రేడయింది.
 
భారతి ఇన్ఫ్రాటెల్
సింధు టవర్స్‌తో కంపెనీ విలీనం కోసం గడువు ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఫలితంగా కంపెనీ షేర్లు 1.52% పడిపోయి రూ. 229,50 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
ఆర్ఐఎల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 0.51% తగ్గి 52 వారాల గరిష్టానికి కొద్దిగా తక్కువగా అంటే రూ. 1719.00 ల వద్ద ట్రేడవుతోంది. ఈ సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు దేశంలోని మూడు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ.
 
గెయిల్
నేటి సెషన్ లో, గెయిల్ స్టాక్స్ 1.68% పెరిగి రూ. 103.10 ల వద్ద ట్రేడ్ అయ్యాయి, కంపెనీ తన నాలుగవ త్రైమాసికంలో నికర లాభాలలో 170% బలమైన పెరుగుదలను నివేదించింది.
 
కెనరా బ్యాంక్
నాలుగవ త్రైమాసికంలో, కెనరా బ్యాంక్, బలహీనమైన ఆదాయాని నివేదించిన తరువాత కెనరా బ్యాంక్ షేర్లు 3.88% తగ్గి రూ. 105.25 ల వద్ద ట్రేడ్ అయింది. ఈ కంపెనీ మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,259.30 కోట్లు నష్టాన్ని ఇవేదించింది.
 
భారత రూపాయి
నేటి వాణిజ్య సెషన్ లో యుఎస్ డాలర్ తో భారత రూపాయి మారకం విలువ 75.75 రూపాయలుగా స్వల్పంగా ట్రేడ్ అయింది.
 
బంగారం
కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, నేటి ట్రేడింగ్ సెషన్‌లో బంగారం బలంగా ఉంది, దీని ఫలితంగా దీని కొనుగోలు సురక్షితంగా ఉంది.
 
తగ్గిన గ్లోబల్ మార్కెట్స్ ట్రేడ్ 
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నడుమ యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 0.03 శాతం, ఎఫ్‌టిఎస్‌ఇ 100 0.19 శాతం తగ్గాయి. నాస్‌డాక్ 2.19%, నిక్కీ 225 1.22%, హాంగ్ సెంగ్ 0.50% తగ్గాయి.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments