మార్కెట్లకు ఫుల్‌జోష్.. తొలిసారి 48 వేల మార్కును దాటిన సెన్సెక్స్

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (16:12 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు త్వరలోనే దేశీయంగా తయారైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయనే వార్తలు ముంబై స్టాక్ మార్కెట్‌లో సరికొత్త ఆశలు రేపాయి. దీంతో సెన్సెక్స్ దూకుడు ప్రదర్శించింది. 
 
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా మార్కెట్లు సోమవారం రికార్ధు స్థాయిలో ముగిశాయి. 
 
ఈ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కారణంగా సెన్సెక్స్ తొలిసారి 48 వేల మార్కును అధిగమించింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 308 పాయింట్లు పెరిగి 48,177కి చేరుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 14,132కి ఎగబాకింది.
 
సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అత్యధికంగా లాభపడిన కంపెనీల షేర్లలో ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్చీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ వంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ తదితర కంపెనీల షేర్లు లాభాలను చవిచూశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments