Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ అండ్ ఫైనాన్స్ పైపైకి, దూకుడుగా స్టాక్ మార్కెట్

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (22:36 IST)
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల స్టాక్స్ వరుసగా ఆరో రోజు కూడా భారతీయ మార్కెట్లకు ఆజ్యం పోసాయి. దీనితో నిఫ్టీ ఈ రోజు 82.45 పాయింట్లు లేదా 0.83 శాతం పెరిగి 10061.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 284.01 పాయింట్లు లేదా 0.84% పెరిగి 34109.54 వద్ద ముగిసింది.
 
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లోని 11 రంగాల శ్రేణిలో తొమ్మిది సానుకూల ధోరణితో ముగిశాయి. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ సూచిక నేతృత్వంలో ఈ రోజు 5 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ సహా ఇతర నిఫ్టీ సూచీలు కూడా 1-3 శాతం శ్రేణిలో ఊపందుకున్నాయి.
 
ఈ రోజు గణనీయమైన లాభాలు పొందినవి, కోటక్ మహీంద్రా (3.11%), ఐసిఐసిఐ బ్యాంక్ (2.61%), ఎం అండ్ ఎం (5.43%), బజాజ్ ఫైనాన్స్ (3.15%), మరియు నెస్లే (2.68%) కాగా, ఎన్టిపిసి (1.96%), విప్రో ( 1.74%), భారతి ఇన్ఫ్రాటెల్ (1.95%), జీ ఎంటర్టైన్మెంట్ (1.99%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.51%) అత్యధిక నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
 
వ్యక్తిగత షేర్లలో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ జనవరి-మార్చి కాలంలో రూ. 871 కోట్ల నష్టాన్ని నమోదు చేసినప్పటికీ, గత ఏడాది ఇదే కాలంలో 596 కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే ప్రస్తుతం 13 శాతానికి పెరిగింది. ఫలితాల అనంతర ప్రకటనలో, ఖర్చు తగ్గింపులను ప్రవేశపెట్టడం ద్వారా తన ఆర్థిక పరిస్థితులను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఈ కంపెనీ తెలిపింది.
 
సారెగామా 
ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాంలో వీడియో మరియు ఇతర సామాజిక అనుభవాల కోసం సారెగామా సంగీతానికి లైసెన్స్ ఇవ్వడానికి సారెగామా మరియు ఫేస్ బుక్‌ల మధ్య ప్రపంచ ఒప్పందం ప్రకటించబడింది. ఈ వార్త సంస్థ యొక్క షేర్ ధరను 20% అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ చేయడానికి దారితీసింది. ఈ షేరు రూ. 334.65 వద్ద ముగిసింది.
 
భారతి ఇన్ఫ్రాటెల్
భారతి ఇన్ఫ్రాటెల్ వాటా 1.95% పెరిగి రూ. 218.90 మార్కెట్ ధర వద్ద ముగిసింది. భారతీయ ఇన్ఫ్రాటెల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు పూజా జైన్ను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, కీలక కార్యనిర్వహణా సిబ్బందిగా నియమించింది.
 
ప్రపంచ మార్కెట్లు
ప్రపంచ మార్కెట్లు ర్యాలీని కొనసాగించాయి. ఇది ఈ రోజు మూడు నెలల గరిష్టాన్ని తాకింది. 49 దేశాల్లో వాటాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎస్సిఐ ప్రపంచ ఈక్విటీ సూచీ 2020 మార్చి 6 నుంచి ఈరోజే అత్యధిక స్థాయికి చేరుకుంది. వస్తువులలో, చమురు ధరలు పెరిగాయి. మార్చి, 2020 తరువాత మొదటిసారిగా బ్యారెల్‌కు 40 డాలర్లు దాటింది. ముడి చమురు ధరల పెరుగుదలకు కారణాలు ఏవంటే తక్కువ యుఎస్ ఇన్వెంటరీలు మరియు కోవిడ్-19 ప్రేరిత సంక్షోభం నుండి డిమాండ్ రికవరీ సంకేతాలు.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments