Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో పరుగెడుతున్న స్టాక్ మార్కెట్, కానీ చైనా-అమెరికా ఉద్రిక్తల వల్ల...

Advertiesment
భారత్‌లో పరుగెడుతున్న స్టాక్ మార్కెట్, కానీ చైనా-అమెరికా ఉద్రిక్తల వల్ల...
, శుక్రవారం, 29 మే 2020 (21:50 IST)
భారత మార్కెట్లు నేడు వరుసగా మూడవ రోజున కూడా పెరిగాయి. సానుకూల నోట్‌తో ముగిశాయి. సెన్సెక్స్ 223.51 పాయింట్లు లేదా 0.69% పెరిగి 32424.10 వద్ద ముగిసింది, నిఫ్టీ 90.20 పాయింట్లు లేదా 0.95% పెరిగి 9580.30 వద్ద ముగిసింది. ఐటి మినహా, ఇతర రంగాల సూచీలు 1-2% మధ్య పెరిగాయి.
 
మార్కెట్ లాభదారులు మరియు నష్టపరులు
నేటి వాణిజ్యంలో, 1390 షేర్లు విలువలు పెరిగాయి. అయితే 924 షేర్లు క్షీణించాయి. 159 షేర్లు విలువలో మార్పులేదు. అత్యధిక లాభాలు పొందిన వారిలో ఒఎన్‌జిసి (5.14%), బజాజ్-ఆటో (4.15%), సన్ ఫార్మా (3.88%), ఐటిసి (3.38%), హీరో మోటోకార్ప్ (3.08%) ఉన్నాయి. సెన్సెక్స్ నష్టపోయిన వారి జాబితాలో కోటక్ బ్యాంక్ (0.38%), యాక్సిస్ బ్యాంక్ (1.96%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.51%), టైటాన్ (1.02%), ఎం అండ్ ఎం (0.83%), మరియు టిసిఎస్ (1.68%) ఉన్నాయి. విస్తృత మార్కెట్ సూచీలు కూడా ర్యాలీలో పాల్గొన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ మరియు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ రెండూ నేటి వాణిజ్యంలో 1 శాతానికి పైగా పెరిగి వరుసగా, 13,273 మరియు 4,002.80 లను తాకాయి.
 
ప్రధాన కంపెనీలలో అతిపెద్ద ఇంట్రాడే లాభం వోడాఫోన్ ఐడియా వాటాపై గూగుల్ కన్నేసిందనే వార్త ఒక విదేశీ ప్రచురణ ద్వారా ప్రచురించబడిన తరువాత దీని షేర్ విలువ 35% పెరిగింది. భారతదేశంలో దివాలా కోసం కంపెనీ దాఖలు చేసిన చర్చల మధ్య గత ఏడాది కాలంగా ఈ స్టాక్ ఒత్తిడిలో ఉంది. ఐటి సేవల సంస్థ, విప్రో, మిస్టర్ థియరీ డెలాపోర్ట్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా అధికారి మరియు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రకటించిన తరువాత ఈ రోజు పెరిగిన ఇతర ముఖ్యమైన స్టాక్స్‌లో ఐటి సేవల సంస్థ విప్రో (6.65) శాతం రూ. 212.55 కు చేరుకుంది. 
 
ఇతర షేర్లలో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ (4.02%), జెబి కెమికల్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ (3.67%) పెరిగాయి, మరియు డివిస్ ల్యాబ్ (3.46%) పెరిగింది. సువెన్ లైఫ్ సైన్సెస్ 4% (3.96%), ఆల్కెమ్ ల్యాబ్స్ (3.03%), ఆర్తి ఇండస్ట్రీస్ (1.10%) వద్ద పడిపోయాయి. ఫ్యూచర్ కన్స్యూమర్ 5% (4.68%) వద్ద మరియు కోల్గేట్ 3% (3.18%) వద్ద లాభపడింది.
 
మార్చి 24 నుండి ప్రతి ఐదు బిఎస్ఇ 500 స్టాక్ లలో మూడు స్టాక్‌ల పనితీరు తక్కువగా ఉన్నాయని డేటా ఋజువు చేయడంతో కోవిడ్-19 ద్వారా దెబ్బతిన్న స్టాక్స్ భారీ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
 
గ్లోబల్ మార్కెట్లో పతనం
చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పందన కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నందున, హాంగ్ కాంగ్ పై నియంత్రణను కఠినతరం చేయాలనే నిర్ణయానికి ప్రతిఘటనగా ఆసియా దేశంపై చర్యను ప్రకటించడానికి విలేకరుల సమావేశం నిర్వహిస్తామని వార్తాకథనాలు ఆయనను ఉటంకిస్తున్న నేపథ్యంలో శుక్రవారం రోజున గ్లోబల్ మార్కెట్లు పతనమయ్యాయి. యుఎస్-చైనా మధ్య కొనసాగుతున్న విభేదాలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింక్ లిమిటెడ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.10 వేల లోపు రెండు ఫోన్లు హాట్ 9, హాట్ 9 ప్రో సిరీస్ లాంఛ్ చేసిన ఇన్ఫినిక్స్