Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశీ స్టాక్ మార్కెట్ : తొలిసారి 76 వేల మార్క్‌ను చేరుకున్న సెన్సెక్స్

ఠాగూర్
సోమవారం, 27 మే 2024 (17:26 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం పరుగులు తీశాయి. ఒక దశలో 76 వేల మార్క్‌ను తాకాయి. సాయంత్రానికి మళ్లీ ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్‌.. ఆఖరులో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది.
 
సోమవారం ఉదయం సెన్సెక్స్ సూచీ 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,009.68 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22,932.45 వద్ద స్థిరపడింది. 
 
అలాగే, డాలరుతో రూపాయి మారకం విలువ 83.13గా ఉంది. సెన్సెక్స్‌లో ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడగా.. విప్రో, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 82.62 వద్ద ట్రేడవుతుండగా.. ఔన్సు బంగారం ధర 2345.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments