Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధాకృష్ణ రాసలీలల "మజులి ద్వీపం"

ప్రతి ఏడాది మూడూ రోజులపాటు రాస ఉత్సవం జరిగే ప్రాంతమే మజులి ద్వీపం. ద్వీపం అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే మంచినీటి మధ్య ద్వీపాలు కూడా ఉన్నాయి. నదుల మధ్యలో ఉన్న ఇలాంటి

Webdunia
సోమవారం, 21 మే 2018 (13:30 IST)
ప్రతి ఏడాది మూడూ రోజులపాటు రాస ఉత్సవం జరిగే ప్రాంతమే మజులి ద్వీపం. ద్వీపం అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే మంచినీటి మధ్య ద్వీపాలు కూడా ఉన్నాయి. నదుల మధ్యలో ఉన్న ఇలాంటి ద్వీపాలలో ప్రపంచంలోనే అతిపెద్దది ఈ మజులి ద్వీపం. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్రానది మధ్యలో ఏర్పడిన ఈ మజులి ద్వీపం ఎంతో సుందరమైనది. 
 
ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్‌లలో నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మరచిపోలేని మధురమైన అనుభూతి అని చెప్పవచ్చు. మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ, పుట్టలూ, నదీ జలాలు లాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా అవన్నీ కాలుష్యానికి దూరంగా, అతీతంగా నిలిచి ఉంటాయి. మానవుడి కన్ను ఈ ప్రాంతంపై పడలేదు కాబట్టే ఇక్కడి సౌందర్యం ఏ మాత్రం ధ్వంసం కాకుండా స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
 
ఏ రోజు చూసినా సరికొత్త తాజాదనంతో నిండిన ఈ మజులి ద్వీపంలో గత ఐదు వందల సంవత్సరాలకు పైగానే మానవులు నివసిస్తున్నప్పటికీ స్వచ్ఛమైన ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అనేక వందల సంవత్సరాలుగా రాజవంశాలు, ఇతర పాలకులు వాడిన ఆయుధాలు, ధరించిన దుస్తులు ఇక్కడ నేటికీ కనిపిస్తున్నాయి. మజులి ద్వీపవాసులు ఇప్పటికీ పై తరహా దుస్తులనే వాడుతున్నారు.
 
ప్రతి సంవత్సరం ఈ మజులి ద్వీపంలో మూడురోజుల పాటు జరిగే ఉత్సవంలో శ్రీకృష్ణుడు గోపికల రాసలీలలను జరుపుతారు. అది ఒక రకమైన ఆధ్యాత్మిక ఉత్సనం. ఇక్కడి గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటాయి. కొత్త వాతావరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలనుకునే జంటలకు మజులి ఓ అద్భుతమైన అనుభవానిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments