Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకర సంక్రాంతి రోజున నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోవచ్చా?

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (13:20 IST)
Pongal
మకర సంక్రాంతి రోజున స్నానం తర్వాత ఆహారం తీసుకోవాలి. సాయంత్రం పూట రాత్రి వేళలో ఆహారం తీసుకోకూడదు. మకర సంక్రాంతి పర్వదినాన మిగిలిపోయిన ఆహారం తీసుకోకూడదు. అలా తీసుకుంటే ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయని చెప్తుంటారు. తద్వారా కోపం కూడా అధికమవుతుంది. 
 
మకర సంక్రాంతి పర్వదినాన ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోకూడదు. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలను తమ ఆహారంలో తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఆకుకూరలు, శాకాహారం తీసుకోవాలి. 
 
సంక్రాంతి రోజున చెట్ల నీరుపోయడం చేయొచ్చు. చెట్లను నరకకూడదు. ప్రకృతికి హాని కలిగించకూడదు. పేదలకు దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి.
 
మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపం నుండి విముక్తి, మోక్షం లభిస్తుంది. గంగా స్నానం ఉత్తమం. మకర సంక్రాంతి రోజున, ప్రతి ఒక్కరూ తన పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. ఈ కారణంగా ఇంట్లో పితృదోషం తొలగిపోతుంది. ఈ రోజున, మహారాజ్ భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలకు శాంతి కోసం గంగానదిలో తర్పణం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాన్ కార్డు 2.0: ఇప్పుడున్న పాన్‌కార్డులు ఇక పనికిరావా?

'సీజ్ ద షిప్' : పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం... స్టెల్లా నౌక సీజ్ (Video)

వైన్ షాపు వద్ద గొడవ.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది.. ఎలా?

మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భక్తులు!! (Video)

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన నటి, ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో శనిగ్రహ మార్పు... ఈ ఐదు రాశులకు అంతా అనుకూలం..

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

తర్వాతి కథనం
Show comments