Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి.. కాలాష్టమి.. రెండూ ఒకేసారి.. ఏం చేయాలి..

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (22:37 IST)
సంక్రాంతి... కాలాష్టమి అంటే అష్టమి తిథి ఒకేసారి రావడం విశేషం. అందుకే జనవరి 15వ తేదీన సూర్యునితో పాటు కాలభైరవ పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఉదయం పూట సూర్య భగవానుడిని.. సాయంత్రం పూట కాలభైరవ పూజను చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. ఇంకా సంక్రాంతి రోజున వచ్చే అష్టమి రోజున సూర్య, భైరవులకు వ్రతం ఆచరించవచ్చు. 
 
సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి.. నేతితో దీపం వెలిగించాలి.  పాలు నైవేద్యంగా సమర్పించాలి. కాలభైరవ అష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని పఠించాలి. 
 
సాయంత్రం పూట కాలభైరవ ఆలయాన్ని సందర్శించి.. నేతితో దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. మాంసాహారం తీసుకోకుండా సాత్త్విక ఆహారం తీసుకోవాలి. వీలైతే కాలభైరవునికి అభిషేకానికి పాలు ఇవ్వడం చేయొచ్చు. మిరియాలతో దీపం వెలిగించవచ్చు. 
 
భైరవుడిని ఆరాధించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. ఆందోళనలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి జాతకంలో శని, రాహువు, కేతు దోషాలుంటే తొలగిపోతాయి. సరైన శుభ ముహూర్తంతో భగవంతుడిని పూజించడం వల్ల దురదృష్టకరమైన ప్రభావాలు కూడా తొలగిపోతాయి. 
 
ఈ పూజ ఒక వ్యక్తి క్రమంగా ప్రశాంతత, శాంతి వైపు ముందుకు సాగడానికి సహాయపడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments