Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరంలో మీ లక్ష్యాలు ఏంటి.. అమలుకు ప్లాన్ ఏంటి?

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (11:59 IST)
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ఈ ఆలోచనే, కుర్రకారు నుంచి వృద్ధుల దాకా నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. వారం పది రోజుల ముందు నుంచే నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ ఏర్పాట్లతో పాటు. వచ్చే యేడాదిలో ప్రారంభించాల్సిన పనుల గురించి తమ లక్ష్యాల గురించి ప్లాన్లు వేసుకుంటారు. వీటినే రిజల్యూషన్స్ అంటారు. ఈ సంస్కృతి పాశ్చాత దేశాల నుంచి ఆసియా దేశాలకు కూడా క్రమంగా వ్యాప్తి చెందింది.
 
మంచి ఏదైనా సరే, ఎక్కడున్నా సరే స్వీకరిస్తే తప్పేం లేదని చాలా మంది అనుసరిస్తున్నారు కూడా. మనలో ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేక మార్పు చేయాలనుకుంటే, ఓ ప్రత్యేక రోజు కోసం వెతుకుతారు. ఆ రోజు నుంచి మార్పు దిశగా ప్రయాణం సాగిస్తారు. ఎక్కువ మంది పుట్టిన రోజు, పెళ్లి రోజు లేదంటే ఏదైనా పండగను అందుకు గుర్తుగా పెట్టుకుంటారు.
 
న్యూ ఇయర్ కూడా అలాంటిదే ఇది, ఆంగ్ల సంవత్సరాది కాబట్టి ఆ రోజు నుంచి కొత్త నిర్ణయాలు అమలు చేయాలని చాలా మంది భావిస్తారు. గతేడాది ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకుని అమలు చేయడం ఆరంభిస్తారు. కొత్త సంవత్సరంలో తొలిరోజు సంతోషంగా ఉంటే మిగతా రోజులంతా అలాగే ఉంటామనేది ఓ మానసిక భావన. ఆ రోజు కొత్త రిజల్యూషన్‌ను ప్రారంభిస్తే ఖచ్చితంగా సాధిస్తామని జీవితంలో పెను మార్పులకు ఇది కారణం అవుతుందని చాలా మంది నమ్మకం.
 
పిల్లల నుంచి వృద్ధుల దాకా వారి ఆలోచనలను బట్టి చేయాలనుకున్న పనులను బట్టి రిజల్యూషన్స్ను పెట్టుకుంటారు. దానికై శ్రమించి విజయం సాధిస్తారు. రోజు ఏదైనా స్థిరమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే మధ్యలో కాస్త అవరోధాలు వచ్చినా పట్టు వదలకుండా పని చేసుకుంటూ పోతే ఫలితాలు తప్పక వస్తాయి.
 
వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుందనేది నానుడి. ఈ రిజల్యూషన్స్ కూడా అంతే, ప్రారంభం అనేది జరిగితే అలా చివరిదాకా కొనసాగిస్తే అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అలా చేయని వారు మధ్యలోనే చతికిలపడతారు. పరిస్థితుల కారణంగా చాలా మంది ఏడాది ప్రారంభంలో తీసుకున్న రిజల్యూషన్స్ అమలు చేయాలేకపోతారు. మరో ఏడాదిలోనైనా వాటిని సాధించాలని, తమ కలను సాకారం చేసుకోవాలని మళ్లీ ప్రయత్నిస్తారు. మలి ప్రయత్నంలో విజేతలు ఎక్కువగానే ఉంటారు.
 
ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతే ప్రతి ఒక్కరూ విజయం సాధించొచ్చు. మంచి పని ప్రారంభించడానికి మంచి ముహూర్తం అంటూ ఏదీ లేదు కానీ ఏదో ఒక గుర్తు ఉండాలి. కాబట్టి చాలా మంది న్యూ ఇయర్ రోజు కొత్త పనులు, అలవాట్లు ప్రారంభిస్తారు. నేటి తరం యువతకు స్థిరత్వం కాస్త తక్కువ కాబట్టి పెట్టుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండరు అనేది కొందరి వాదన. క్యాలెండర్ మారినంత మాత్రాన పెట్టుకున్న లక్ష్యాలకు తగినట్లుగా శ్రమించకపోతే సరైన ఫలితాలు రావు కదా అని అంటున్నారు వారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments