దక్షిణాది పుణ్యక్షేత్రాలను రూ.7,140లతోనే చుట్టేయవచ్చు.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (20:18 IST)
కోవిడ్ నుంచి జనం ఇంకా కోలుకోలేదు. అయితే అన్ లాక్ ప్రక్రియ కారణంగా జనం బయటి గాలిని పీల్చుకుంటున్నారు. అంతకుముందు ఇంటికే పరిమితమైన ప్రజలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. ఉద్యోగాలకు వెళ్తున్నారు.. పర్యటనలకు వెళ్తున్నారు.. ఇందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి కాస్త రిలీఫ్ కలిగించేలా ఐఆర్‌సీటీసీ ఓ టూర్ ప్యాకేజీనందిస్తోంది.
 
దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను సందర్శించుకోవాలనుకునే వారు ఈ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. ఇందులో భాగంగా ఆరు రోజులపాటు టూర్ ఉంటుంది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం సంస్థ 'ఐఆర్‌సీటీసీ' ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద ప్రయాణికులు దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శించుకోవచ్చు.
 
దక్షిణ భారత్ యాత్ర ట్రైన్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే... తిరుచురాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి తదితర ప్రాంతాలను చుట్టిరావచ్చు. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలును ఎక్కవచ్చు. ఐఆర్‌సీటీసీ అందించే భారత్ దర్శన్ యాత్ర డిసెంబరు 12న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్‌లో రాత్రి 12 గంటలకు ఈ రైలు బయలు దేరుతుంది. ఈ టూర్‌లో వెళ్ళాలనుకుంటే... రూ. 7,140 చెల్లించాలి. కాగా... ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి చార్జీ ఉండదు.
 
రూ. 7,140 చెల్లిస్తే స్లీపర్ క్లాస్‌లో టికెట్ లభిస్తుంది. అలాగే 3 టైర్ ఏసీలో కూడా ప్రయాణించే అవకాశముంటుంది. ఇందుకోసం రూ. 8,610 చెల్లించాల్సి ఉంటుంది. ఇక భోజనాన్ని ఐఆర్‌సీటీసీనే ఉచితంగా అందిస్తుంది. కాగా... ఈ టూర్ ఆరు రోజుల పాటు సాగుతుంది. ఈ టూర్‌కు వెళ్లాలని భావిస్తే... ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంకేముంది..? దక్షిణ భారత్ లోని ప్రసిద్ధ ఆలయాలను చుట్టేసేందుకు టికెట్లను బుక్ చేసుకోండి.. మరి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా పోలీసు అధికారి నిర్లక్ష్యం: చనిపోయిన కర్నూలు యువతి కుటుంబానికి రూ. 262 కోట్ల పరిహారం

అసెంబ్లీ ఇమేజ్‌ను పెంచకపోయినా పర్లేదు.. అణగదొక్కే హక్కు ఎవరిచ్చారు.. స్పీకర్ ఫైర్

YS Sharmila: అమరావతికి చట్టబద్ధత అంటూ డ్రామాలు ఆడుతున్నారు.. వైఎస్ షర్మిల

Forced Marriage: పోలీసు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వ్యక్తి కిడ్నాప్ చేశారు.. ఆపై పెళ్లి చేశారు..

Nara Lokesh: పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?

ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స

ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన

గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments