Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిరిడీ సాయిబాబా ఆలయంలో డ్రెస్ కోడ్.. ఇది విజ్ఞప్తి మాత్రమే..

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (23:02 IST)
సంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రస్తుతం దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమలులో వుంది. ఇందులో భాగంగా దేశంలోని పలు సుప్రసిద్ధ ఆలయాల్లో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నారు. తాజాగా షిరిడీ సాయిబాబాను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఆలయ ట్రస్టు నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. 
 
కరోనా కారణంగా రద్దయిన షిరిడీ సాయి దర్శనాలు.. దాదాపు 8 నెలల తర్వాత ఇటీవల ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధలను పాటిస్తూ భక్తులను ఆలయానికి అనుమతిస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. 
 
గంటకు 900 చొప్పున ప్రతి రోజు 6000 మందిని మాత్రమే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు. దర్శనం కోసం ఆన్‌లైన్‌లోనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 65 ఏళ్లు పైబడిన వారిని, 10 ఏళ్ల లోపు చిన్నపిల్లలను అనుమతించడం లేదని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో షిరిడీ దర్శనానికి వచ్చే భక్తులు మనదేశ సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరారు.
 
అయితే ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమేనని.. ఇప్పటి వరకు కచ్చితమైన డ్రెస్‌ కోడ్‌ ఏదీ విధించలేదని ఆలయ ట్రస్టు బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయమై శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ బాగటే మాట్లాడుతూ.. బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరారు.
 
గతంలో కొందరు అభ్యంతరకర దుస్తులతో ఆలయంలోకి రావడంపై ఫిర్యాదు అందాయని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఇది కేవలం తమ విన్నపం మాత్రమేనన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments