Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రేటర్ పోరు : హైదరాబాద్‌లో దిగిన షా.. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు!

Advertiesment
GHMC Poll
, ఆదివారం, 29 నవంబరు 2020 (12:03 IST)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయభేరీ మోగించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు ఉరకలేస్తున్నారు. ఇదే సత్తాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసమే.. బల్దియా ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలంతా పాల్గొంటున్నారు. 
 
ఇప్పటికే పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వీధుల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ తెలంగాణ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బీజేపీ నేతలతో కలిసి అమిత్ షా నేరుగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు.
webdunia
 
అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమిత్ షా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాగా, అమిత్ షా రాక సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన వివిధ కార్యక్రమాలను ముగించుకుని ఆదివారం సాయంత్రానికి ఢిల్లీకి వెళతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నివర్' ముప్పు తొలగింది.. 'బురేవి' భయం వణికిస్తోంది!