Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఆగ‌మోక్తంగా విష్ణుసాల‌గ్రామ పూజ, ఎందుకు చేస్తారంటే..?

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (19:22 IST)
క‌రోనా నేప‌థ్యంలో లోక‌క్షేమాన్ని కాంక్షిస్తూ ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన కార్య‌క్ర‌మాల్లో మొద‌ట‌గా విష్ణుసాల‌గ్రామ పూజ గురువారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా జ‌రిగింది. ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు.

ఈ మండ‌పంలో శ్రీ భూవ‌రాహ‌స్వామి, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ప్ర‌తిమ‌ల‌ను ఏర్పాటుచేశారు. అదేవిధంగా, ఉసిరి, ల‌క్ష్మీ తుల‌సి, రామ‌తుల‌సి, కృష్ణ‌తుల‌సి త‌దిత‌ర ప‌విత్ర‌మైన చెట్ల‌ను కొలువుదీర్చారు. ముందుగా ప్రార్థ‌నా సూక్తం, అష్ట‌దిక్పాల‌క ప్రార్థ‌న‌, న‌వ‌గ్ర‌హ ప్రార్థ‌న‌తో విష్ణుసాల‌గ్రామ పూజ‌ను ప్రారంభించారు. 
 
అనంత‌రం వేద‌పండితులు వేద‌మంత్రాలు ప‌ఠిస్తుండ‌గా అర్చ‌కులు సాల‌గ్రామాల‌కు పాలు, పెరుగు, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ఆ త‌రువాత  శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, సాల‌గ్రామాల‌కు హార‌తులు స‌మ‌ర్పించారు. నైవేద్యం స‌మ‌ర్పించిన అనంత‌రం క్షమా మంత్రం, మంగ‌ళంతో ఈ పూజ ముగిసంది. 
 
ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ సాల‌గ్రామాలు సాక్షాత్తు విష్ణువు అవ‌తార‌మ‌ని, సాల‌గ్రామ పూజ వ‌ల్ల స‌ర్వ‌జ‌న ర‌క్ష‌ణ‌, స‌మ‌స్త బాధ‌ల ఉప‌శ‌మ‌నం క‌లుగుతాయ‌ని తెలిపారు. సాల‌గ్రామాల‌కు చేసిన అభిషేక తీర్థాన్ని సేవిస్తే స‌మ‌స్త పాపాలు తొల‌గి, స‌ర్వ‌వ్యాధులు నివారించ‌బ‌డ‌తాయ‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

ఎంపీ విజయసాయిరెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాలి.. నారా లోకేష్‌కు విజ్ఞప్తి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

తర్వాతి కథనం
Show comments